
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay)తో డైరక్టర్ వెంకట్ ప్రభు రూపొందించిన చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The Greatest of All Time Movie). భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ఊహించని విధంగా డివైడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. చివరికి డిజాస్టర్ అయ్యింది.
ఈ సినిమాని తెలుగులో ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ వింగ్ 'మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పి' (Mythri Distributors LLP) భారీ స్థాయిలో రిలీజ్ చేసింది. తెలుగులో సైతం ఈ సినిమా కొద్దిగా కూడా వర్కవుట్ కాలేదు.
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా నిండా దర్శకుడు క్యామియోలు, సర్పైజ్ ఎలిమెంట్స్ ని నింపేయటం మీద ఉన్న శ్రద్ద కథపై పెట్టలేదని విమర్శలు వచ్చాయి. ఆడియన్స్ వాటిని చూసి అసలు కథని మర్చిపోయి మరీ మురిసిపోతారనుకుంటే అది జరగటం లేదు. మరీ ముఖ్యంగా నార్త్ బెల్ట్, కేరళ, తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ అసలు కనపడటం లేదు. ఈ సినిమా విషయంలో తప్పు జరిగిందని దర్శకుడు వెంకట్ ప్రభు ఇప్పుడు ఒప్పుకున్నారు.
రీసెంట్ గా దర్శకుడు వెంకట్ ప్రభు, విజయ్ తండ్రి S. A.చంద్రశేఖర్ ఓ ఈవెంట్ కు కలిసి హాజరయ్యారు. అక్కడ ఓ రిపోర్టర్ వెంకట్ ప్రభుని డైరక్ట్ గా గోట్ మూవి గురించి అడిగారు. ఆడియన్స్ చాలా మంది ఈ సినిమా చూసి విజయ్ కాంత్ పాత సినిమా రాజదురైలా ఉందని కామెంట్ చేసారనే విషయం ప్రస్తావించారు. దానికి వెంకట్ ప్రభు సమాధానమిస్తూ..తను గోట్ రిలీజ్ కు ముందు రాజాదురైని అసలు చూడలేదని చెప్పారు. ఆ సినిమా గురించి తెలిసి చూసి ఉంటే ఖచ్చితంగా గోట్ ని ఇంకా బాగా తీసేవాడిని అన్నారు.
అలాగే గోట్ చిత్రం స్టోరీ లైన్ యూనిర్శల్ అని తండ్రి, కొడుకు మధ్య వస్తే సమస్యలను డీల్ చేస్తుందని అన్నారు. పోలికలు రాకుండా ఉండటం కోసం తాను తండ్రి,కొడుకులు ఉన్న సంఘర్షణతో కూడిన చాలా సినిమాలు చూసానని అన్నారు. ఇది విన్న వారు షాక్ అయ్యారు. విశేషం ఏమిటంటే రాజదురై సినిమాకు డైరక్టర్ మరెవరో కాదు విజయ్ తండ్రి, ఆ సమయంలో ప్రక్కనే స్టేజిపై ఉన్న S. A.చంద్రశేఖర్. ఆయన ఏమీ మాట్లాడపోయినా ఖచ్చితంగా నవ్వుకుని ఉంటారు అని అంటున్నారు.
సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమాలో ‘డీ-ఏజింగ్’ టెక్నాలజీని వినియోగించారు. దీని సాయంతో విజయ్‌ని పాతికేళ్ల కుర్రాడిగా చూపించారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా కీలక పాత్రలు పోషించారు. తమిళ చరిత్రలోనే భారీస్థాయిలో (తమిళనాడులో ఉన్న దాదాపు అన్ని థియేటర్లలో) ఓపినింగ్స్ తెచ్చుకుని ఈ సినిమా విడుదలై రికార్డు నెలకొల్పింది. అయితే ఆ తర్వాత డ్రాప్ అయ్యింది.
చిత్రం కథేమిటంటే...దేశ రక్షణ కోసం ఎంతకైనా తెగించే ఓ ఏజెంట్ కథ ఇది. అనుకోని పరిస్థితుల్లో అతను ఓ మిషన్‌లో తన కొడుకును కోల్పోవలసి రావడం.. కొద్ది కాలనికే ఆ కొడుకే 15ఏళ్ల తర్వాత తన పాలిట యముడిలా మారి దేశానికి పెను సమస్యలా మారడం.. ఈ క్రమంలో అతని ఆట కట్టించేందుకు ఆ తండ్రి ఏం చేశాడన్నది క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. నిజానికి ఈ కథ (GOAT Movie Story)లో పెద్దగా కొత్తదనమేమీ లేకున్నా.. స్క్రీన్‌ప్లే స్పెషలిస్ట్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన సినిమా (GOAT Movie) కావడంతో దీంట్లో తప్పకుండా ఓ మ్యాజిక్ కనిపిస్తుందన్న భరోసా ప్రేక్షకుల్లో కపిస్తుంది. అయితే అలాంటిది జరగలేదు.