కెరీర్ బిగినింగ్ లో ప్రాధాన్యత లేని సపోర్టింగ్ రోల్స్ చేశాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు చిత్రం ఆయనకు హీరోగా గుర్తింపు తెచ్చింది. దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కిన రొమాంటిక్ లవ్ డ్రామా పెళ్లి చూపులు ఏకంగా నేషనల్ అవార్డు సొంతం చేసుకుంది. కమర్షియల్ గా కూడా ఆడింది. పెళ్లి చూపులు అనంతరం విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి ఒక సెన్సేషన్. బోల్డ్ అండ్ ఇంటెన్స్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది.
నిర్మాతలకు పెద్ద మొత్తంలో లాభాలు పంచింది. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. గీత గోవిందంతో విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ గా మారిపోయాడు. గీత గోవిందం తో విజయ్ దేవరకొండ మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. గీతా ఆర్ట్స్ నిర్మించిన రొమాంటిక్ లవ్ డ్రామా గీత గోవిందం అనేక రికార్డులు బ్రేక్ చేసింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందించింది.
rx 100 movie
గీత గోవిందం అనంతరం విజయ్ దేవరకొండ నుండి ఆ రేంజ్ మూవీ రాలేదు. ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా విజయ్ దేవరకొండ నాలుగు బ్లాక్ బస్టర్ చిత్రాలను చేజేతులా వదులుకున్నారు. వాటిలో ఆర్ ఎక్స్ 100 ఒకటి. కార్తికేయ హీరోగా నటించిన ఆర్ ఎక్స్ 100 సంచలన విజయం నమోదు చేసింది. డెబ్యూ డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించాడు. అర్జున్ రెడ్డి కి ఏమాత్రం తీసిపోకుండా ఆర్ ఎక్స్ 100 ఉంటుంది.
అయితే అప్పటికే అర్జున్ రెడ్డి మూవీ చేసి ఉన్న విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశాడట. అర్జున్ రెడ్డి ఛాయలు ఈ సినిమాలో ఉన్నాయని దేవరకొండ ఆర్ఎక్స్ 100 చేయలేదట. పూరి జగన్నాధ్-రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 75 కోట్ల గ్రాస్ రాబట్టింది. పూరి, ఛార్మిలను ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ మూవీకి మొదట అనుకున్న హీరో విజయ్ దేవరకొండ. కానీ విజయ్ దేవరకొండకు హీరో క్యారెక్టరైజేషన్ నచ్చక నో చెప్పాడట.
మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ సేతుపతి కీలక రోల్ చేశాడు. కరోనా ఆంక్షల మధ్య కూడా వసూళ్లు కుమ్మేసిన ఈ మూవీకి హీరోగా బుచ్చిబాబు సాన విజయ్ దేవరకొండను అనుకున్నారట. కాకపోతే.. అర్జున్ రెడ్డి, గీత గోవిందం విజయాలతో విజయ్ దేవరకొండ ఇమేజ్ మారిపోవడంతో, తనకు ఉప్పెన కథ సెట్ కాదని ఆయన భావించారట.
వెంకీ కుడుముల-నితిన్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ భీష్మ. నితిన్ కి జంటగా రష్మిక మందాన నటించింది. నితిన్ కెరీర్లో భీష్మ వన్ ఆఫ్ ది హిట్ మూవీస్. ఈ మూవీలో హీరోగా మొదట విజయ్ దేవరకొండను అనుకున్నారట. కానీ విజయ్ దేవరకొండ భీష్మ కథను రిజెక్ట్ చేశాడట. దాంతో విజయ్ దేవరకొండ మరో హిట్ కోల్పోయాడు.