రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం జూన్ 4న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. పెద్ది చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రం అసలెందుకు చూడాలో 5 కారణాలలో తెలుసుకుందాం.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది మూవీ గ్రాండ్ రిలీజ్ కి అన్ని ఏర్పాట్లు చక చకా పూర్తవుతున్నాయి. టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. భోపాల్ జరిగిన మ్యూజిక్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ముంబైలో లాంచ్ చేసిన ట్రైలర్ ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. బుచ్చిబాబు ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఇదిలా ఉండగా జూన్ 4న రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని అసలు ఎందుకు చూడాలి అని ప్రశ్నించుకున్నప్పుడు 5 కారణాలు కనిపిస్తాయి. అవేంటో అప్పుడు చూద్దాం.
26
రాంచరణ్ నటన
రాంచరణ్ ఈ చిత్రంలో నట విశ్వరూపం ప్రదర్శించినట్లు ప్రచారం జరుగుతోంది. నటన మాత్రమే కాదు క్రికెటర్ గా, కుస్తీ వీరుడిగా, రన్నర్ గా కనిపించేందుకు చరణ్ తన ఫిజిక్ ని మార్చుకున్న విధానం అద్భుతం అని అంటున్నారు. రాంచరణ్ నటనలో, బాడీలో ఇంకెన్ని వేరియేషన్స్ ఉంటాయో సినిమా చూసే తెలుసుకోవాలి. కొన్ని సన్నివేశాల్లో చరణ్ నటన కంటతడి పెట్టించేలా ఉంటుంది అంటూ ప్రచారం జరుగుతోంది.
36
జాన్వీ కపూర్ గ్లామర్
ముందు నుంచి జాన్వీ కపూర్ గ్లామర్ ని హైలైట్ చేస్తూ వస్తున్నారు. ట్రైలర్, సాంగ్స్ లో జాన్వీ గ్లామరస్ గా కాస్త కొంటెతనం ఉన్న అమ్మాయిలా కనిపిస్తోంది. రాంచరణ్, జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పెద్ది కనుక హిట్టై, అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ వస్తే బుచ్చిబాబు నేరుగా క్రేజీ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. బుచ్చిబాబుకి ఇది రెండవ చిత్రం మాత్రమే. బుచ్చిబాబు పెద్ది చిత్రంతో ఇచ్చే సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
56
దివ్యేందు శర్మకి తొలి తెలుగు చిత్రం
దివ్యేందు శర్మని చూడగానే నార్త్ ఆడియన్స్ మున్నాభాయ్ అని పిలుస్తారు. మీర్జాపూర్ సిరీస్ ద్వారా అతడికి వచ్చిన క్రేజ్ అలాంటిది. నార్త్ మొత్తం మూవీ లవర్స్ కి అతడు తెలుసు. మంచి క్రేజ్ ఉంది. దివ్యేందు శర్మ ఇది తొలి తెలుగు చిత్రం. రాంచరణ్, దివ్యేందు శర్మ మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా బావుంటాయని అంటున్నారు.
66
ఏఆర్ రెహమాన్ సంగీతం
డైరెక్టర్ బుచ్చిబాబు ఏరికోరి ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకున్నారు. ఆయన్ని ఒప్పించడం కష్టం అయినా కూడా కథతో ఇంప్రెస్ చేశాడు. రెహమాన్ ఈ చిత్రానికి ఇచ్చిన ప్రతి సాంగ్ యూట్యూబ్ లో బ్లాక్ బస్టర్ రేంజ్ లో దూసుకుపోతోంది. బీజీయంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.