OTT Movies: ప్రైమ్ వీడియోలో టాప్ 5 మూవీస్ ఇవే, సైలెంట్ కిల్లర్ గా అల్లాడించిన జ్యోతిక..అస్సలు మిస్ కావద్దు

Published : May 29, 2026, 04:04 PM IST

ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ లో ఉన్న టాప్ 5 సినిమాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. ఇందులో జ్యోతిక నటించిన సిస్టమ్ లాంటి అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. 

PREV
16
OTT Movies

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ అందిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ట్రెండ్ అవుతున్న సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రైమ్ వీడియోలో ఎక్కువగా థ్రిల్లర్ చిత్రాలు ట్రెండ్ అవుతున్నాయి. జ్యోతిక నటించిన సిస్టమ్ నుంచి గాయపడ్డ సింహం వరకు టాప్ 5 ఉన్న సినిమాల జాబితా ఈ కథనంలో ఉంది.

26
సిస్టమ్

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, సౌత్ నటి జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ లో నెంబర్ 1 స్థానంలో ఉంది. కోర్ట్ రూమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా అద్భుతంగా నటించారు. ఇక జ్యోతిక పాత్ర అయితే ఊహకు అందని విధంగా ఉంటుంది. ఆమె కోర్ట్ లో పనిచేసే ఉద్యోగి. దీనితో చట్టంలో ఉన్న లొసుగుల గురించి బాగా అవగాహన ఉంటుంది. వాటిని ఉపయోగించుకుని తన చేతికి మట్టి అంటకుండా కోర్టు ద్వారానే తన ప్రతీకారం ఎలా తీర్చుకుంది అనేది కథ. ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులని ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంటోంది. అస్సలు మిస్ కాకుండా ఈ చిత్రాన్ని చూసేయండి.

36
జాక్ ర్యాన్ గోస్ట్ వార్

జాన్ క్రసిన్స్కి, సియన్న మిల్లర్ ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ చిత్రం ఇది. ప్రైమ్ వీడియోలో నెంబర్ 2 స్థానంలో ట్రెండ్ అవుతోంది. యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలని కోరుకునే అభిమానులు అస్సలు మిస్ కాకుడని మూవీ ఇది.

46
ఎల్ఐకె

ప్రదీప్ రంగనాథన్ నటించిన ఈ చిత్రం విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కింది. థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోలేకపోయింది ఈ చిత్రం ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ పొందుతోంది. ప్రైమ్ వీడియోలో 3వ స్థానంలో ట్రెండ్ అవుతోంది.

56
కాళిదాస్ 2

ఇది తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో భరత్, సంగీత నాయర్, అజయ్ కార్తీ కీలక పాత్రల్లో నటించారు. సీరియల్ హత్యల ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. ప్రైమ్ వీడియోలో 4వ స్థానంలో ట్రెండ్ అవుతోంది.

66
గాయపడ్డ సింహం

తరుణ్ భాస్కర్ నటించిన ఫన్ ఎంటర్టైనర్ మూవీ ఇది. ప్రైమ్ వీడియోలో 5వ స్థానంలో ట్రెండ్ అవుతోంది. వినోదం కోరుకునే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories