సుహాస్, బర్రెలక్క, పల్లవి ప్రశాంత్, గంగవ్వ.. సంచలనంగా మారిన యూట్యూబ్ స్టార్స్ వీళ్లే..

First Published | Nov 25, 2023, 3:35 PM IST

యూట్యూబ్ లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రస్తుతం బర్రెలక్క పేరు మారుమోగుతోంది. బర్రెలక్కలా యూట్యూబ్ నుంచే క్రేజ్ దక్కించుకుంది. సంచలనంగా మారింది. ఇదే రూట్లో దుమ్ములేపిన వారి గురించి తెలుసుకుందాం.

యూట్యూబ్ లో నిరుద్యోగిగా కర్నె శిరీష సరదాగా ఓ రీల్ పోస్ట్ చేసింది. బర్రెలక్క (Barrelakka)గా తను షేర్ చేసిన వీడియోతో వైరల్ గా మారింది. నెమ్మదిగా యూట్యూబ్ సెలబ్రెటీగా మారిపోయింది. నేడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పేరు మారుమోగిపోయేలా మారిపోయింది. సోషల్ మీడియా అంతటా ఆమె పేరే వినిపిస్తోంది. న్యూస్ ఛానెళ్లలోనూ హాట్ టాపిక్ గ్గా మారింది. సరదాగానో.. అసహనం కొద్దే నిరుద్యోగిగా తను పోస్ట్ చేసిన వీడియోతో నేడు సంచలనంగా మారింది. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలోకి దిగింది. ఈల గుర్తుపై ప్రచారం చేస్తోంది. 

రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth)   ఎంత క్రేజ్ దక్కించుకున్నాడో తెలిసిందే. అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోలను పోస్ట్ చేస్తూ పాపులర్ అయ్యాడు. నేడు పాపులర్ రియాలిటీ గేమ్ షో Bigg Boss Telugu 7లో టాప్ కంటెస్టెంట్ గా నిలిచి సెన్సేషన్ క్రియేట్  చేస్తున్నాడు. బిగ్ షో నుంచి రైతుల వాయిస్ వినిపిస్తున్నాడు. ఈ సిద్ధిపేట రైతు బిడ్డకు ఆడియెన్స్ నుంచీ మద్దుతు దక్కుతోంది. 


‘కలర్ ఫొటో’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ హీరో సుహాస్ (Suhas) కూడా యూట్యూబ్ లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. చాయ్ బిస్కేట్ చానెల్ ద్వారా ‘అతిథి’, ‘కళాకారుడు’ తదితర షార్ట్ ఫిల్మ్స్ లో నటించి గుర్తింపు దక్కించుకున్నారు. దాంతోనే నెమ్మదిగా మూవీస్ లో అవకాశాలు దక్కాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి, ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నారు. చివరిగా ‘రైటర్ పద్మభూషన్’, ‘మనుచరిత్ర’ వంటి చిత్రాలతో అలరించాడు. నెక్ట్స్ ‘అంబాజీపేట మార్యేజ్ బ్యాండ్’తో రాబోతున్నారు. 

జీవితంలో అంతా అయిపోయింది అన్న దశలోనూ..  తనలో ఉన్న ప్రతిభకు దేశమొత్తం ఆశ్చర్యపోయేలా చేసింది గంగవ్వ (Gangavva). My Village Show యూట్యూబ్ ఛానెల్ తో ఈమె ప్రయాణం మొదలైంది. అనిల్ జీలా యూట్యూబర్ తో ప్రస్తుతం యూట్యూబ్ లో సందడి చేస్తూనే ఉంది. వయస్సు మీద పడినా యువకులకు ధీటుగా షార్ట్ ఫిల్మ్స్ లో నటించి నవ్వించింది. యూట్యూబ్ లో సెన్సేషన్ గా మారింది. బిగ్ బాస్ లో అడుగుపెట్టి మరింత గుర్తింపు సొంతం చేసుకుంది. అంతర్జాతీయ చానెళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చి ఇతరులకు స్ఫూర్తిగా మారింది.

పదేళ్ల కింద ఓ కామెడీ వీడియో ద్వారా వైవా హర్ష (Harsha Chemudu)  ప్రయాణం ప్రారంభమైంది. తను అడిగిన వైవా ప్రశ్నలకు అప్పట్లో యూట్యూబ్ షేక్ అయ్యింది. మనోడి యాస, భాష, ప్రశ్నించే తీరు, ముఖ కదలికలకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఇప్పటికీ మీమర్స్ వాటిని గుర్తుచేస్తూనే ఉంటారు. అలా మొదలై ప్రస్తుతం లీడ్ రోల్ లో నటిస్తున్నారు. వైవా హర్ష  త్వరలో ‘సుందరం మాస్టర్’ చిత్రంతో అలరించబోతున్నారు. ఇలా మరింత మంది ఉన్నారు. కానీ వీరు మాత్రం యూట్యూబ్ కే పరిమితం కాకుండా కెరీర్ లో ముందుకు దూసుకెళ్తున్నారు. 
 

కవర్ సాంగ్స్ తో డాన్సర్ గా షన్ముఖ్ జశ్వంత్ (Shanmukh Jaswanth)  బాగా పాపులర్ అయ్యారు. దాంతోనే బిగ్ బాగ్ తెలుగులో అవకాశం దక్కించుకున్నారు. ప్రస్తుతం వరుస పెట్టి సీరిస్ లు చేస్తున్నారు. Surya  సిరీస్ తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. టాప్ వ్యూయర్ షిప్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఏజెంట్ ఆనంద్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.పలు విషయాల్లో అప్పుడప్పుడు వార్తల్లోనూ నిలుస్తూనే ఉంటారు. 

Latest Videos

click me!