తమిళ ముద్దుగుమ్మ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు. కొద్దికాలం ఈ బ్యూటీ నెటిజన్లను తన బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంటూ వస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూ మైమరిపిస్తోంది.
గ్లామర్ షోకు దూరంగా ఉండే ప్రియాంక అరుళ్ మోహన్ తన బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ ఉంటుంది. స్కిన్ షోకు చాలా దూరం. ఎప్పుడూ ట్రెడిషనల్ లుక్ లోనే మెరుస్తూ మంత్రముగ్ధులను చేస్తూ ఉంటుంది. కానీ ఇటీవల రూటు మార్చుకుంది.
సంప్రదాయ దుస్లుల్లో నిండుగా వెలిగే ఈ ముద్దుగుమ్మ ఇటీవల వరుసగా గ్లామర్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. ట్రెడిషనల్ వేర్ అయినా, ట్రెండీ వేర్ అయినా సాధ్యమైనంత వరకు గ్లామర్ విందు చేస్తూ మతులు పోగొడుతోంది.
తాజాగా ప్రియాంక మోహన్ బ్లూ ట్రాన్స్ ఫరెంట్ శారీలో దర్శనమిచ్చింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, జాలి లాంటి కొంగులో అందాల విందు చేసింది. పద్ధతిగానే మెరిసినా గ్లామర్ మెరుపులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. కొంటే ఫోజులతో చూపు తిప్పుకోకుండా చేసింది.
మత్తెక్కించే చూపులు, మతులు చెడగట్టే ఫోజులతో ఈ ముద్దుగుమ్మ అందాల దుమారం రేపుతోంది. ఒకప్పటితో పోల్చితే తమిళ భామ ఆఫర్లు కూడా భారీగానే అందుకుంటోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మరింతగా గ్లామర్ మెరుపులతో రచ్చచేస్తోంది. అందరి చూపు తనపై పడేలా చేస్తోంది.
తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) OG చిత్రంలో అవకాశం దక్కించుకుంది. అలాగే ‘సరిపోదా శనివారం’లో నాని సరసన మరోసారి నటిస్తోంది. అటు తమిళంలో బిగ్ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. చేతి నిండా సినిమాలతో బిజీయేస్ట్ హీరోయిన్ గా మారిపోయింది.