ఎన్టీఆర్, పవన్, మహేష్... ఈ స్టార్ హీరోకు సమంత ఇచ్చిన ట్యాగ్ ఏమిటో తెలుసా?

Published : Mar 07, 2024, 12:11 PM IST

సమంత టాలీవుడ్ స్టార్ లేడీ. పలువురు టాప్ హీరోలతో జతకట్టింది. వాళ్లకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది. మరి ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ లపై సమంత ఒపీనియన్ ఏమిటో తెలుసా...   

PREV
16
ఎన్టీఆర్, పవన్, మహేష్... ఈ స్టార్ హీరోకు సమంత ఇచ్చిన ట్యాగ్ ఏమిటో తెలుసా?

సమంత పరిశ్రకు వచ్చి 14 ఏళ్ళు అవుతుంది. ఆమె డెబ్యూ మూవీ ఏమాయ చేసావే 2010లో విడుదలైంది. ఇన్నేళ్ల కెరీర్లో సమంత వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. అంచెలంచలుగా ఆమె ఎదిగింది. డిజిటల్ సిరీస్లలో కూడా నటిస్తూ నేషనల్ వైడ్ ఫేమ్ తెచ్చుకుంది. 

 

26

సమంత దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. ఒక్క ప్రభాస్ ని మినహాయిస్తే ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో ఆమె జతకట్టారు. సమంత నటించిన బృందావనం, దూకుడు, అత్తారింటి దారేది భారీ విజయాలు సాధించాయి. 

36


ఎన్టీఆర్, మహేష్, పవన్ కళ్యాణ్ లతో సమంత నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. కాగా ఈ ముగ్గురు హీరోల ఒక ట్యాగ్ ఇవ్వాలి అనుకుంటే ఏమిస్తుందో సమంత ఓ సందర్భంలో చెప్పింది. ఆ ఓల్డ్ వీడియో వైరల్ అవుతుంది. 
 

46

యాంకర్ మొదటగా ఎన్టీఆర్ కి ఏం ట్యాగ్ ఇస్తారని అడగ్గా... గ్రేట్ డాన్సర్ అని చెప్పింది. ఎన్టీఆర్ తో ఫస్ట్ టైం బృందావనం మూవీలో సమంత నటించింది. అనంతరం రామయ్య వస్తావయ్యా, రభస చిత్రాల్లో సమంత, ఎన్టీఆర్ కలిసి నటించారు. 

56

ఇక మహేష్ బాబుకి ఏం ట్యాగ్ ఇస్తావంటే,... మోస్ట్ డిజైరబుల్ అని సమంత చెప్పింది. సమంత-మహేష్ దూకుడు మూవీలో జతకట్టారు. దూకుడు బ్లాక్ బస్టర్ హిట్. అనంతరం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , బ్రహ్మోత్సవం చిత్రాలు చేశారు. 

 

66

మరి పవన్ కళ్యాణ్ కి మీరిచ్చే ట్యాగ్ ఏమిటని సమంతను యాంకర్ అడిగాడు. కొంచెం భిన్నంగా మై గురు అని చెప్పింది. ఆయనతో నాది గురు శిష్యుల అనుబంధం అని సమంత అన్నారు. సమంత-పవన్ కళ్యాణ్ కాంబోలో విడుదలైన అత్తారింటి దారేది బ్లాక్ బస్టర్ కొట్టింది. 

Read more Photos on
click me!

Recommended Stories