Ghaati First Review: `ఘాటి` మూవీ ఫస్ట్ రివ్యూ, అనుష్కకి సాలిడ్‌ కమ్‌ బ్యాక్‌.. హైలైట్స్ ఇవే, మైనస్‌లు ఏంటంటే?

Published : Sep 03, 2025, 04:22 PM IST

అనుష్క కొంత గ్యాప్‌తో నటించిన మూవీ `ఘాటి`. శీలావతి గాంజా చుట్టూ తిరిగే ఈ సినిమా ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది. సినిమాలో హైలైట్స్ తోపాటు మైనస్‌లు కూడా లీక్‌ అయ్యాయి. 

PREV
15
`ఘాటి` మూవీ ఫస్ట్ రివ్యూ

అనుష్క శెట్టి చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. `బాహుబలి` నుంచి ఆమె ఇదే పంథాని ఫాలో అవుతుంది. అయితే దీనికి తన వెయిట్‌ అనేది ప్రధాన సమస్య అని తెలుస్తోంది. అందుకే ప్రమోషన్స్ కి కూడా దూరంగా ఉంటోంది. తాజాగా ఆమె `ఘాటి` సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా రాజీవ్‌ రెడ్డి, వంశీ ప్రమోద్‌లు నిర్మించారు.  సెప్టెంబర్‌ 5న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చింది. సినిమా ఎలా ఉండబోతుందో ఓ క్లారిటీ వచ్చింది.

25
`ఘాటి` మూవీ సెన్సార్‌ రిపోర్ట్

`ఘాటి` సినిమా ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకుంది. యు /ఏ సర్టిఫికేట్‌ వచ్చింది. సినిమా రెండు గంటల 35 నిమిషాల నిడివి ఉంటుందట. ఇది డీసెంట్‌ నిడివిగా చెప్పొచ్చు. అదే సమయంలో సినిమాపై సెన్సార్‌ బోర్డ్ వారు పాజిటివ్‌గా రియాక్ట్ అయినట్టు తెలిపారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం ఎలా ఉండబోతుందో రిపోర్ట్ బయటకు వచ్చింది. టీమ్‌ నుంచి, ఇప్పటికే మూవీని చూసిన వారి నుంచి అందుతున్న సమాచారం మేరకు `ఘాటి` మూవీ ఫస్టాఫ్‌ ఎమోషనల్‌గా ఉంటుందట. సెకండాఫ్‌ పూర్తి యాక్షన్‌గా ఉంటుందని తెలుస్తోంది.  

35
`ఘాటి` మూవీ ఫస్ట్ రివ్యూ

సినిమా కథ చాలా కొత్తగా ఉంటుందని, ఇప్పటి వరకు తెలుగు తెరపై చూడనటువంటి కథ ఇది అని దర్శకుడు క్రిష్‌  స్పష్టం చేశారు. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ డల్‌గా ఉంటాయని, ఆశించిన స్థాయిలో క్వాలిటీ లేదని తెలుస్తోంది. కాకపోతే అనుష్క పాత్ర మాత్రం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, గతంలో ఎప్పుడు చూడనివిధంగా ఇందులో ఆమె కనిపిస్తుందట. ఓ కొత్త అనుష్కని చూడొచ్చు అని వెల్లడించారు. శీలావతి పాత్రలో ఆమె చేసే యాక్షన్‌ వేరే లెవల్‌ అని అంటున్నారు. అయితే సినిమాలో ఏడు యాక్షన్‌ సీన్లు ఉంటాయని నిర్మాత రాజీవ్‌ రెడ్డి చెప్పడం విశేషం. అవి కొన్ని చిన్న చిన్న బ్లాక్‌లుగా ఉంటాయట.

45
`ఘాటి` హైలైల్స్, మైనస్‌లు

సినిమాలో అనుష్కతోపాటు విక్రమ్‌ ప్రభు, జగపతిబాబు, చైతన్యరావు వంటి వారు నటిస్తున్నారు. కాస్టింగ్‌ పరంగా భారీగా ఉంటుందని, వారి పాత్రలు అంతే బలంగా ఉంటాయని తెలుస్తోంది. లొకేషన్లు కూడా కొత్తగా ఉంటాయని దర్శకుడు క్రిష్‌ తెలిపారు. రియలిస్టిక్‌ ఫ్లేవర్‌ కోసం చాలా వరకు ఒరిజినల్‌ లొకేషన్లలోనే చిత్రీకరించారట. రైల్వే స్టేషన్‌ ఎపిసోడ్‌ హైలైట్‌గా ఉంటుందని, ఇంటర్వెల్‌ ఆకట్టుకుంటుందని టీమ్‌ చెబుతుంది. చాలా వరకు నేచురల్‌గా రా గా సన్నివేశాలుంటాయని, వాటిలో అనుష్క నటన బాగుంటుందని అంటున్నారు. ఇలా ఎమోషనల్‌ డెప్త్ తోపాటు యాక్షన్‌ సీన్లు, అనుష్క నటన సినిమాకి పెద్ద అసెట్‌ అని, అదే సమయంలో నిర్మాణ విలువలు, టెక్నీకల్‌గా సినిమా ఆశించిన స్థాయిలో ఉండదని, యాక్షన్‌ ఓవర్‌ డోస్‌లో ఉంటుందని సమాచారం. సినిమాకి ఎమోషన్స్ ముఖ్యం. అవి కనెక్ట్ అయితే సినిమా ఆకట్టుకుంటుంది. ఇందులో ఆ ఎమోషన్స్ ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతాయా? అనేది పెద్ద మ్యాటర్‌.

55
`ఘాటి` కథ ఏంటంటే?

రైటర్‌ డాక్టర్ చింతకింద శ్రీనివాసరావు ఈ`ఘాటి` కథ గురించి దర్శకుడు క్రిష్‌కి చెప్పారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్‌లో శిలావతి గాంజా రకం పెరుగుతుంది, దానికోసం ఒక వ్యవస్థ పని చేస్తుంటుంది, వాటిని మోయడానికి కొంతమంది కూలీలు ఉంటారు. వారిని ఘాటీలని పిలుస్తారు. వాళ్ళ నేపథ్యం గురించి చెప్పినప్పుడు దర్శకుడు క్రిష్‌ ఎక్సైట్‌ అయ్యారు. వారిదంతా ఒక కొత్త ప్రపంచం. జీవన శైలి అంతా కొత్తగా ఉంది. ఒక కొత్త ప్రపంచం, కల్చర్ ని చూపించే స్కోప్‌ ఉండటంతో ఈ మూవీ స్టార్ట్ చేసినట్టు దర్శకుడు క్రిష్‌ తెలిపారు. ఆయా సంఘటనల ఆధారంగా చేసుకుని ఈ కథని ఒక ఫిక్షనల్‌ కథగా రాసుకున్నారట. సర్వైవల్ కోసం చేసినా పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఐడెంటిటీ, సర్వైవల్ థీమ్స్ తో వస్తున్న సినిమా ఇదని తెలిపారు దర్శకుడు. ఎమోషనల్‌, యాక్షన్‌ మేళవింపుగా ఉన్న ఈ మూవీ ఆడియెన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories