విజయ్ నువ్వో అనకొండ అంతా నాశనం చేశావ్ వినాశకాలే విపరీత బుద్ధి... ఓ రేంజ్ లో తిట్టాడు!  

Published : Aug 27, 2022, 09:43 AM IST

లైగర్ ఎఫెక్ట్ విజయ్ దేవరకొండను చాలా కాలం వెంటాడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని కొన్న థియేటర్ యజమాని విజయ్ దేవరకొండపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు.   

PREV
15
విజయ్ నువ్వో అనకొండ అంతా నాశనం చేశావ్ వినాశకాలే విపరీత బుద్ధి... ఓ రేంజ్ లో తిట్టాడు!  
Vijay Devarakonda


విడుదలైన అన్ని భాషల్లో లైగర్ నష్టాలు మిగల్చడం ఖాయం. తెలుగులో ఓపెనింగ్స్ పరంగా పర్లేదనిపించిన లైగర్, ఇతర భాషల్లో అవి కూడా కోల్పోయింది. ముఖ్యంగా లైగర్ హిందీ వర్షన్ నెగిటివ్ టాక్ తో భారీగా నష్టపోయింది. విపరీతమైన హైప్ క్రియేట్ కావడంతో రెట్టింపు ధరలు చెల్లించి కొన్న బయ్యర్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఈ క్రమంలో ముంబైకి చెందిన మనోజ్ దేశాయ్ అనే థియేటర్ యజమాని విజయ్ దేవరకొండను తిట్టిపోశాడు. అతని పొగరు కారణంగా నాశనమయ్యానంటూ ఓ రేంజ్ లో ధ్వజమెత్తాడు. 

25
Vijay Devarakonda


మనోజ్ దేశాయ్ తాజా ఇంటర్వ్యూలో లైగర్ విడుదలకు ముందు విజయ్ చేసిన కొన్ని కామెంట్స్ ఓపెనింగ్స్ ని తీవ్రంగా దెబ్బతీశాయి అన్నారు. కావాలంటే నా సినిమాను బాయ్ కాట్ చేసుకోండని చెప్పి విజయ్ పెద్ద తప్పు చేశాడని విమర్శించాడు. విజయ్ నువ్వు కొండవి కావు అనకొండవు. లైగర్ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నాను. ఇప్పుడు సర్వం కోల్పోయాను. నీ మాటలు అడ్వాన్స్ బుకింగ్స్ రాకుండా చేశాయి. 
 

35
Vijay Devarakonda


నువ్వు ఓ అహంకారివి. వినాశకాలే విపరీత బుద్దులు. పోయే కాలం వస్తే నోటి నుండి ఇలాంటి మాటలే వస్తాయి. నువ్వు పొగరుబోతువి. నీలానే మా సినిమాను కావాలంటే బాయ్ కాట్ చేసుకోండని చెప్పి అమిర్ ఖాన్, తాప్సి, అక్షయ్ కుమార్ నష్టపోయారు. నీ పొగరు వలన లైగర్ కి ఓపెనింగ్స్ దక్కలేదంటూ మనోజ్ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. ఈ ఇంటర్వ్యూ జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. 

45
Vijay Devarakonda


నెపో కిడ్ అనన్య పాండే హీరోయిన్ కావడం, కరణ్ జోహార్ నిర్మాతగా ఉండడంతో పాటు ప్రెస్ మీట్స్ లో విజయ్ దేవరకొండ చూపించిన యాటిట్యూడ్ నచ్చని నెటిజెన్స్ బాయ్ కాట్ లైగర్ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. ఆ సమయంలో విజయ్ దేవరకొండ కావాలంటే నా సినిమా బాయ్ కాట్ చేసుకోండి, నచ్చితేనే చూడండి లాంటి పొగరుతో కూడిన కామెంట్స్ చేసి మూవీ దారుణ ఫలితానికి కారణమయ్యాడనేది ఆయన ఆరోపణ. 

55
Vijay Devarakonda

లాల్ సింగ్ చెడ్డా ప్రమోషన్స్ లో అమిర్ ఖాన్ ఓ సున్నితమైన అంశంపై స్పందించారు. అది నచ్చని జనాలు బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా అని పిలుపునిచ్చారు. ఆ చిత్ర హీరోయిన్ కరీనా కపూర్ కొంచెం పొగరుతో కూడిన వ్యాఖ్యలు చేశారు. మా సినిమా నచ్చితేనే చూడండి లేదంటే వదిలేయండి, మేమేమి బ్రతిమిలాడడం లేదని అన్నారు. ఆ వ్యాఖ్యలు మరింత ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇవన్నీ గమనిస్తున్న విజయ్ దేవరకొండ మౌనంగా ఉంటే సరిపోయేది మరి.

click me!

Recommended Stories