రేటు పెంచేసిన సీతారామం సుందరి.? ఒక్క హిట్ పడిందో.. లేదో మృణాల్‌కు కొమ్ములొచ్చాయా..?

First Published Aug 27, 2022, 9:39 AM IST

ఇలా హిట్ పడిందో లేదో.. అలా రేటు పెంచేస్తున్నారు సినీ తారులు. అందులో ముఖ్యంగా హీరోయిన్లు అయితే వెంటనే కొంచెం కూడా ఆసస్యంచేయకుండా రెమ్యూనరేషన్ నెంబర్ మార్చేస్తున్నారు. రీసెంట్ గా ఆ లిస్ట్ లోకి మృణాల్‌ ఠాకూర్ కూడా వచ్చి చేరింది. 

Mrunal Thakur

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. అది పాత సామెత.. ఫిల్మ్ కెరీర్ మంచిఊపు మీద ఉండగానే సంపాదించుకోవాలి.. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు వర్తిస్తున్న సరికొత్త సామెత. ఈ సూత్రాన్ని పాటించే.. హిట్ పడగానే రేటు పెంచేస్తున్నారు హీరోయిన్లు. ప్రస్తుతం సీతారామం ఫేమ్ మృణాల్‌ ఠాకూర్ 

మరాఠి భామ మృణాల్‌ ఠాకూర్‌  టాలీవుడ్ లో హిటు కొట్టేసింది. వచ్చి రావడంతోనే ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ సాధించింది. మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ తో ఆమె జంటగా నటించిన సీతారామం భారీ విజయం అందుకుంది. అనూహ్యమైన విజయంతో టీమ్ అంతా ఫుల్ ఖుషీ అయ్యారు. అటు  మృణాల్‌ ఠాకూర్‌  కూడా పట్టలేని సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఈ సినిమాతో ఆమెకు తెలుగులో మంచి డిమాండ్‌ పెరిగినట్లు తెలుస్తోంది.

ఇక టాలీవుడ్ లో  ఆమెకు డిమాండ్‌ పెరగడంతో.. వరుఆఫర్లు కూడా తలుపు తడుతున్నాయట..దాంతో  మృణాల్‌ ఠాకూర్‌ భారీగా రెమ్యునరేషన్‌ పెంచిందనే టాక్‌ వినిపిస్తోంది. వైజయంతి బ్యానర్లో స్వప్న సినిమా పతాకంపై  మృణాల్ కు సినిమా ఛాన్స్ వచ్చిందట. నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఇందులో ఇప్పటికే మృణాల్‌ను ఖరారు చేశారని, ఆమె ఈ ప్రాజెక్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ కూడా  ఇచ్చిందని తెలుస్తోంది.  

ఇక సినిమాకు ఆమె ప్రస్తుతం కోటీ రూపాయల  డిమాండ్‌ చేస్తోందని సమాచారం. దీంతో ఫస్ట్ సినిమా హిట్ అయ్యిందో లేదో.. అప్పుడే ఇంత డిమాండ్ చేస్తోందేందని ఫిల్మ్ మేకర్స్ విస్తు పోతున్నారట. ఆమె ఆ నెంబర్ చెప్పగానే అవాక్కవుతున్నారట. ఇప్పుడే ఇంత డిమాండ్ చేస్తోంది.. ముందు ముందు ఆమెను ఆపగలమా అని నిర్మాతలు చర్చించుకుంటున్నట్టు సమాచారం. 

వైజయంతి బ్యానర్లో సీతారామం చేసిన ఆమె ఇదే బ్యానర్లో మరో సినిమాకు కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది. పెద్ద ప్రొడక్షన్‌ అయిన వైజయంతి బ్యానర్లోనే ఆమె రెండు సినిమాలు చేస్తుండటంతో ఆమెను వరుసగా ఫిల్మ్ మేకర్స్ సంప్రదిస్తున్నారట. పెద్ద ప్రొడక్షన్ లో వరుసగా రెండు సినిమాలు చేయడం ఆమెకు బాగాకలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. 

Image: Mrunal ThakurInstagram

 టీవీ సీరియల్స్‌ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చింది మృణాల్‌.  మరాఠిలో చాలా టీవీ సీరియల్స్‌లో నటించిన ఆమె.. అక్కడ బాగా పాపులర్ అయ్యింది..  ఆ తర్వాత బాలీవుడ్‌ చిన్ని చిన్న సినిమాలు చేస్తూ వెండితెరపై నటిగా ఎదిగింది. ఈ క్రమంలో ఆమె హిందీ జెర్సీలో హీరోయిన్‌గా చాన్స్‌ కొట్టేసింది. అదే ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. 

హిందీలో జెర్సీ సినిమా యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ మృణాల్‌ గ్లామర్ .. ఆమె నటకు  మాత్రం మంచి మార్కులు పడ్డాయి. దాంతో టాలీవుడ్ మేకర్స్ కన్ను ఆమెపై పడింది.  దీంతో తెలుగులో సీతారామం మూవీ ఆఫర్‌ అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ తెలుగు సినిమా, హిందీలో నాలుగు వరకూ..  పెద్ద సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. అటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తోందట బ్యూటీ. 

sita ramam five day worldwide box office collection dulquer salmaan mrunal thakur

హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక మందన్నా కీ రోల్‌ పోషించిన ఈ మూవీ ఇప్పటికీ థియేటర్ లో అద్భుతమైన స్పందనతో సందడి చేస్తోంది. సీతామహాలక్ష్మిగా మృణాల్‌ పాత్ర బాగా ఆకట్టుకుంది. తన నటనకు, అందానికి, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  
 

sita ramam lyric video song dulquer salmaan Mrunal thakur

ఇండియన్‌ ఆర్మీ, ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ నటకు ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ కూడా ఫిదా అయినట్టు తెలుస్తోంది. దాంతో ప్రస్తుతం ఆమెకు ఇక్కడ వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయట. 

click me!