నందమూరి బాలకృష్ణ హీరోగా దూసుకుపోతూనే బుల్లితెరపై హోస్ట్ గా కూడా రాణిస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 4 కి రంగం సిద్ధం అయింది. అక్టోబర్ లోనే సీజన్ 4 గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నట్లు ప్రకటించారు. సీజన్ 4 కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్,నందమూరి బాలకృష్ణ, బాలయ్య చిన్న కూతురు తేజస్విని పాల్గొన్నారు.