Sobhan Babu: టాలీవుడ్ లోకి ఎంత మంది హీరోలు వచ్చినా.. అందాల నటుడు, సోగ్గాడు మాత్రం శోభన్ బాబే. ఆయన గ్లామర్ తో పాటు క్రమశిక్షణ అందరికి సాధ్యం కాదు. అంత హుందాగా ఉండే హీరో కూడా ఓ దర్శకుడంటే భయపడేవారంటే మీరు నమ్ముతారా? ఇంతకీ ఎవరా డైరెక్టర్. ?
తెలుగు సినీ పరిశ్రమలో అందగాడిగా, సోగ్గాడిగా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న నటుడు శోభన్ బాబు. ఆయన అందం, నటనతో పాటు క్రమశిక్షణకు కూడా ఎంతో పేరు ఉంది. షూటింగ్‌కు సమయానికి రావడం, అనుకున్న సమయానికి పని ముగించడం వంటి విషయాల్లో ఆయన చాలా కచ్చితంగా ఉండేవారు. సాయంత్రం 6 దాటితే పక్కాగా షూటింగ్ కు ప్యాకప్ చెప్పాల్సిందే. షూటింగ్ లో అందరు శోభన్ బాబు అంటే కాస్త భయపడేవారట. అలాంటి శోభన్ బాబును సైతం భయపెట్టిన దర్శకుడు ఎవరో తెలుసా? ఆ డైరెక్టర్ సినిమా షూటింగ్ అంటే చాలా జాగ్రత్తగా వెళ్లేవారట శోభన్ బాబు. ఇంతకీ ఆయన ఎవరో కాదు వి. మధుసూదన రావు.
23
విక్టరీ ఇంటిపేరుగా చేసుకున్న డైరెక్టర్
టాలీవుడ్ లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ దర్శకులలో వి. మధుసూదనరావు ఒకరు. 'వి ఫర్ విక్టరీ' అని పిలుచుకునే ఈయన రీమేక్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉండేవారు. అయితే, ఆయన సెట్‌లో ఎంతటి కఠినమైన క్రమశిక్షణ పాటించేవారంటే, టాలీవుడ్ స్టార్ హీరోగా వెలుగొందిన నటభూషన్ శోభన్ బాబు కూడా సైతం ఆయన షూటింగ్‌కి వెళ్లాలంటే కాస్త భయపడేవారట! ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు శివనాగేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో స్వయంగా పంచుకున్నారు.
శోభన్ బాబును కూడా టెన్షన్ పెట్టిన దర్శకుడు
తెలుగు తెరపై విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన శోభన్ బాబు తన సన్నిహితులతో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకునేవారట. తాను ఏ సినిమా షూటింగ్‌కైనా ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా వెళ్తానని, కానీ మధుసూదనరావు గారి సినిమా షూటింగ్ అంటే మాత్రం మొదటి రోజు షూటింగ్‌కి వెళ్తున్నంతగా టెన్షన్ పడాల్సి వచ్చేదని చెప్పేవారట. దీనిని బట్టి ఆయన సెట్‌లో క్రమశిక్షణ ఎంత కఠినంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
33
సెట్‌లో మధుసూదనరావు పనితీరు
మధుసూదనరావుకి సెట్‌లో పని విషయంలో ఎక్కడా రాజీపడే తత్వం ఉండేది కాదు. చిన్న పొరపాట్లు జరిగినా ఆయన వెంటనే తీవ్రంగా స్పందించేవారు. డైరెక్టర్ శివనాగేశ్వరరావు 'జగన్నాథ రథచక్రాలు' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు, ప్రతిరోజూ ఎడిటింగ్ రిపోర్ట్, కెమెరా రన్ అయిన రఫ్ ఫుటేజ్ లెక్కలు పక్కాగా రికార్డ్ చేసేవారు. నిర్మాత బడ్జెట్‌ను, అవుట్‌పుట్‌ను బ్యాలెన్స్ చేయడంలో మధుసూదనరావు ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. కేవలం ముఖ్యమైన ఆర్టిస్టులే కాకుండా.. చిన్న డైలాగ్ చెప్పే ఆర్టిస్టులను కూడా ముందుగా ఆఫీస్‌కి పిలిపించి వారి సామర్థ్యాన్ని పరీక్షించిన తర్వాతే సెట్‌లోకి అనుమతించేవారు.
బయటకు ఎంత కఠినంగా, కోపంగా కనిపిస్తారో, లోపల మాత్రం సినిమా పట్ల అంతకంటే ఎక్కువ అంకితభావం కలిగి ఉండేవారు మధుసూదనరావుకి. ఆయన పర్యవేక్షణలోనే ఆచార్య ఆత్రేయ పాటలు రాయడం, ఇళయరాజా సంగీతం సమకూర్చడం వంటి అద్భుతమైన విషయాలు అప్పుడు జరిగేవి. అలాంటి ఉద్దండ దర్శకుల క్రమశిక్షణ వల్లే నాటి చిత్రాలు అప్పట్లో అద్భుత విజయాలను సాధించి, తెలుగు సినిమా చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి.