సుకుమార్ ను మోసం చేసిన స్టార్ హీరో, సినిమా చేస్తానని హ్యాండిచ్చినది ఎవరో తెలుసా..?

First Published | Nov 29, 2024, 7:54 PM IST

ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద స్థాయిలో ఉన్న నటులు, డైరెక్టర్లు ఏదొ ఒక సందర్భంలో ఇబ్బందులుపడ్డవారే. అలాంటి ఇబ్బందులే పడ్డారట పుష్ప డైరెక్టర్ సుకుమార్. ఓ స్టార్ హీరో సుక్కుని సినిమా చేస్తానని తిప్పింకుని హ్యాండ్ ఇచ్చాడట. ఇంతకీ ఎవరా  హీరో. 
 

డైరెక్టర్ సుకుమార్ కు టాలీవుడ్ లో జీనియస్ డైరెక్టర్ అని..లెక్కల మాస్టార్ అని పేరుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి.. టాలీవుడ్ హిస్టరీలో తనకంటూ ఓ పేజ్ ను రాసుకున్నాడు సుక్కు. హీరోలను స్టార్ హీరోలను చేశాడు. హీరోలో కూడా నెగెటీవ్ షేడ్స్ చూపించిన ఘనత సుకుమార్ ది. ఆయన సినిమాలు.. వేసే లెక్కలు.. చేసే సీన్లు అసలు ఎవరు ఊహించరు. 

Also Read: చిరంజీవి చాలా ఇష్టంగా తినే కూర ఏంటో తెలుసా..? మెగాస్టార్ భోజనం ప్లేట్ లో ఆ ఐటం పక్కాగా ఉండాల్సిందే
 

అంత అద్భుతంగా ఉంటాయి. అల్లు అర్జున్ లాంటి హీరోలు ఇప్పుడు ఇంత స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం సుకుమారే. బన్నీకి ఆర్యలాంటి అద్భుతమైన హిట్ ను అందించాడు సుక్కు. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ సినిమాతో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు. ఇప్పుడంటే సుకుమార్ స్టార్ డైరెక్టర్. ఆయన కోసం ఎంత పెద్ద స్టార్ అయినా వెయిట్ చేయాల్సిందే. 

Also Read:ధనుష్ తో ఎఫైర్.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన సౌత్ స్టార్ హీరోయిన్ ను గుర్తు పట్టారా..?


ఆయన సినిమా చేస్తాడా అని ఎదరు చూడాల్సిందే. కాని సుకుమార్ కెరీర్ బిగినింగ్ లో చాలా ఇబందులు ఫేస్ చేశాడంట. చాలామంది హీరోలను తన సినిమా కోసం ట్రై చేశాడట. సుకుమార్. ఈక్రమంలోనే సుకుమార్ టాలీవుడ్ లో అప్పటికి యంగ్ హీరోతో సినిమా చేయాలని ప్నయత్నం చేశాడట. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా..? ఆర్య. 

Also Read:రాత్రి నిద్రపట్టకపోతే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో తెలుసా..? ఎంత మంచి అలవాటో..

అవును అల్లు అర్జున్ నుహీరోగా నిలబెట్టిన ఆర్య సినిమాను సుకుమార్ ముందుగా ఆ యంగ్ హీరోతో చేయాలని చూశాడట. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరో తెలుసా నితిన్. అవును నితిన్ తో తన ఫస్ట్ మూవీ చేయాలనుకున్నాడట. సుకుమార్. అయితే నితిన్ కూడా ఈసినమా చేద్దాం అని ఒకే చెప్పి.. డేట్స్ ఇవ్వకుండా తిప్పించాడట. ఏదైనది క్లారిటీ ఇవ్వకుండా చివరికి సినిమా చేయలేను అని చెప్పేశాట. 
 

అయితే అప్పుడు సుకుమార్ ఈ కథను అల్లు అర్జును్ కు చెప్పడం.. అతను కెరీర్ బిగినింగ్ లో ఇలాంటిప్రయోగం చేయడం అతనికి కలిసి వచ్చింది. ఆర్య సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అంతరరికి తెలిసిందే. ఆతరువాత అల్లు అర్జున్ ను ఆపడం ఎవరి వల్ల కాలేదు. అంతే కాదు సుకుమార్ కూడా స్టార్ డైరెక్టర్ గా.. ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు. 

Nithin, vakkamtham vamsy

నితిన్ ఈసినిమా చేసి ఉంటే పరిస్థతి ఎట్లా ఉండేదో. నితిన్ స్టార్ డమ్ పెరిగేదా అని అనుకుంటుంటారు. సో ఈరకంగా నితిన్ మంచి సినిమాను పోగోట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం పుష్ప2 రిలీజ్ హడావిడిలో ఉన్నారు సుక్కూ అండ్ టీమ్. ఈమూవీ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ దెబ్బతో ఆస్కార్ వరకూ వెళ్ళాలని టీమ్ ప్లాన్. మరి ఏం చేస్తారో చూడాలి. 

Latest Videos

click me!