సమంత తండ్రి తెలుగువారా? చెన్నై లో ఏం చేసేవారో తెలుసా? ఫ్యామిలీ డిటెయిల్స్

First Published | Nov 29, 2024, 7:02 PM IST

తండ్రి హఠాన్మరణంతో సమంత తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఈ క్రమంలో తండ్రికి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. 
 

సమంత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. సమంత తండ్రి కన్నుమూశారు. తనకు పెద్ద దిక్కుగా ఉన్న నాన్న జోసెఫ్‌ ప్రభు శుక్రవారం కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో కన్నుమూసినట్టు తెలుస్తుంది. వాస్తవం ఏంటనేది తెలియాల్సి ఉంది. కానీ సమంత ఫ్యామిలీ ఇప్పుడు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తనకు ఎప్పుడూ ధైర్యంగా ఉండే నాన్న మరణంతో సమంత కన్నీరు మున్నీరవుతున్నారు. తన తండ్రి చనిపోయినట్టు ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఇంకా ఇప్పుడూ కలవలేమా నాన్న అంటూ హార్ట్ బ్రేక్‌ ఎమోజీని పంచుకుంది సమంత. దీంతో సెలబ్రిటీలంతా ఆమెకి సానుభూతి ప్రకటిస్తున్నారు. 
 

ఇదిలా ఉంటే సమంత తండ్రి మరణంతో పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. తండ్రి నేపథ్యం, ఫ్యామిలీ నేపథ్యం నెట్టింట చక్కర్లు కొడుతుంది. అంతేకాదు సమంత తండ్రి తెలుగు వారనే విషయం మరింత ఆసక్తికరంగా మారింది. ఆయన ఆంగ్లో ఇండియన్‌గా చెబుతూ వచ్చారు. కానీ జోసెఫ్‌ది తెలుగు స్టేట్ అట.

ఆయన ఆంధ్రప్రదేశ్‌లోనే జన్మించారట. ఇక్కడే పెరిగారట. ఆ తర్వాత ఫారెన్‌ వెళ్లారని, అట్నుంచి చెన్నైకి వచ్చారని సమాచారం. సమంత తల్లి నైనిత్తే ప్రభు.. ఆమె మలయాళి. తండ్రి తెలుగు.. ఈ ఇద్దరు పెళ్లి చేసుకుని చెన్నైలో సెటిల్‌ అయ్యారట. సమంతనే ఈ విషయం చెప్పడం విశేషం. 

బిగ్‌ బాస్‌తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.


ఇక సమంతకి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారట. ఆమె చిన్న అమ్మాయి. తన అన్నల గురించి మాత్రం చెప్పలేదు. అయితే చెన్నైలో అమ్మా నాన్నలు ఓ స్కూల్‌ని నిర్వహించేవారట. ఫాదర్‌ మెయిన్‌గా చూసుకునేవాడట. సమంతనే ఈ విషయం కూడా తెలిపింది. ఇక స్కూల్‌ టైమ్‌లో కొందరు విద్యార్థులు ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకి ఫీజు పే చేసిందట. అది అందేలా కూడా చూసుకుందట. 
 

కాలేజీ టైమ్‌లోనే స్పెషల్‌ ఈవెంట్లలో పాల్గొంది సమంత. డిగ్రీకి వచ్చాక ఆమె మోడలింగ్‌ వైపు దృష్టిపెట్టింది. అయితే స్కూల్‌లో తాను ఎకనామిక్స్ లో టాపర్‌గా ఉందట. స్టేట్‌ ర్యాంక్ వస్తుందని కూడా టీజర్‌ భావించారట. కానీ పబ్లిక్‌ ఎగ్జామ్స్ లో అందులోనే తక్కువగా వచ్చాయట.

తన పరువంతా పోయిందని చెప్పింది సమంత. ఇదిలా ఉంటే మోడలింగ్‌ నుంచి సినిమాల్లోకి వచ్చిన సమంత `ఏం మాయ చేసావె` చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 

సమంత, నాగచైతన్యతో ప్రేమలో పడింది. 2017లో మ్యారేజ్‌ చేసుకున్నారు. సరిగ్గా నాలుగేళ్లకి విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో సమంత తండ్రి స్పందించారు. ప్రస్తుతం నా మెదడు శూన్యంతో నిండి పోయింది` అంటూ అప్పుడు పోస్ట్ పెట్టారు. తన కూతురు విడాకుల పట్ల ఆయన ఎంతగానో మనోవేదనకు గురైనట్టు తెలుస్తుంది.

ఆ తర్వాత సమంత, నాగచైతన్య రిసెప్షన్‌ ఫోటోలు పంచుకుంటూ చాలా కాలం క్రితం ఒక కథ ఉండేది, ఆ కథ ఇక ఉండకపోవచ్చు. కొత్త కథ, కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం అని పేర్కొన్నారు జోసెఫ్‌. దీంతోపాటు ఆ మధ్య సమంతని టార్గెట్‌ చేస్తూ మాట్లాడిన నేపథ్యంలో నాగార్జున ఫ్యామిలీతోనూ ఆయన గొడవ పడినట్టు సమాచారం. 
 

SAMANTHA

మొత్తానికి తనకి పెద్ద స్ట్రెంన్త్ లా ఉన్న నాన్న మరణంతో సమంత బాగా కుంగిపోతుందనేది నిజం. అయితే సమంతకిది దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి. సమంత చైతూతో విడాకుల సమయంలోనే బాగా స్ట్రగుల్‌ అయ్యింది. పలు సందర్భాల్లో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. తన జీవితంలో అది పెద్ద దెబ్బగా తెలిపింది. దాని కారణంగా ఆమె డిప్రెషన్‌లోకి కూడా వెళ్లింది.

దాన్నుంచి కోలుకునే సమయంలోనే మయోసైటిస్‌ అనే వ్యాధి ఆమెని వెంటాడింది. ఏడాదిగా ఆ వ్యాధితో పోరాడి నిలబడింది. చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది. ఇక దీన్నుంచి కూడా కోలుకుని మళ్లీ ఇప్పుడు కెరీర్‌ పరంగా బిజీ కాబోతుంది సమంత. ఈ క్రమంలోనే తండ్రి మరణం ఆమెకి దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి. 

read more:బ్రేకింగ్: సమంత తండ్రి హఠాన్మరణం!

also read: ప్రభాస్‌ విలన్‌గా మారేలా చేసిన రాజమౌళి, కత్తి కోసం గొడవ.. డార్లింగ్‌ చేసిన పనికి జక్కన్నకి ఫ్యూజులు ఔట్‌

Latest Videos

click me!