బాలయ్య సమరసింహారెడ్డి మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

First Published | Aug 4, 2024, 10:27 PM IST

బాలయ్య సూపర్ హిట్ సినిమా సమరసింహారెడ్డి.. వేరే హీరో చేయాల్సిందా..? స్టార్ హీరో రిజెక్ట్ చేసిన కథతో బాలకృష్ణ హిట్ కొట్టాడా..? ఈ కథను మిస్ చేసుకున్న హీరో ఎవరు..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్లు కొన్ని  కారణాల వల్ల.. కొన్ని సినిమాలు మిస్ చేసుకుని ఉంటారు. ఆ సినిమాలో మరో హీరో చేసి హిట్ అవ్వడం.. లేకుంటా డిజాస్టర్లు అవ్వడం కూడా కామన్ గా జరిగేవే.. సూపర్ హిట్ అయితే.. అయ్యో అనుకోవడం.. డిజాస్టర్ అయితే.. సినిమా చేయకపోవడమే మంచిదయ్యిందని అనుకోవడం సహజం. ఇలానే బాలయ్య బాబు నటించిన సమరసింహారెడ్డ సినిమా విషయంలో కూడా జరిగిందట. 
 

అల్లు అర్జున్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా..? ఐకాన్ స్టార్ ఆ పాత్రలో కనిపిస్తే రికార్డ్ లు బ్రేక్ అవ్వాల్సిందే

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో.. అద్భుతం సమరసింహారెడ్డి సినిమా. అప్పట్లో  ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాల్లో సమరసింహా రెడ్డి కూడా ఒకటి. బి. గోపాల్  డైరెక్ట్ చేసిన  ఈ సినిమాను  చెంగల వెంకట్ రావు నిర్మించారు. తండ్రీకొడుకులుగా బాలయ్య బాబు డ్యూయల్ రోల్ చేసిన చేయ‌గా.. అంజల జవేరి, సిమ్రాన్ హీరోయిన్లుగా న‌టించారు. 
 

మహేష్ బాబు చీరకట్టి.. పూలు పెట్టుకున్న ఏకైక సినిమా..? అంత సాహసం ఎందుకు చేశాడు..?


ఈసినిమా యాక్షన్ బ్యాగ్ గ్రౌండ్ లో అద్భుతంగా వర్కౌట్అయ్యింది. సినిమాకు సరిపోను మ‌ణిశ‌ర్మ అందించిన  సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. ఇప్పటిక ఈ పాటలకు శ్రోతలు పూనకాలు వచ్చినట్టు ఊగిపోతుంటారు. బాలయ్య ఫ్యాన్స్ అయితే ఇక చెప్పనక్కర్లేదు. సంక్రాంతి కానుక‌గా 1999 జనవరి 13న విడుద‌లైన స‌మ‌ర‌సింహా రెడ్డి సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. 

భల్లాలదేవుడు పాత్రకు రానా కంటే ముందుగా అనుకున్న నటుడు ఎవరు..? రాజమౌళి చెప్పిన రహస్యం..
 

6 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈసినిమా 32 కేంద్రాల్లో 100 రోజులు కంప్లీట్ చేసుకుని..ఫుల్ ర‌న్ లో 15 కోట్ల  షేర్‌ని రాబ‌ట్టింది. 100 రోజులు ఆడటమే కాదు..  మూడు థియేటర్లలో 227 రోజులు, 29 కేంద్రాల్లో 175 రోజులు, 122 కేంద్రాల్లో 50 రోజులు, ఒక థియేటర్‌లో  ఏడాదిపాటు ఆడి  సరికొత్త రికార్డ్ లు క్రియేట్ చేసింది సమరసింహా రెడ్డి సినిమా.

900 కోట్లు ఇస్తే విడాకులు ఇస్తా.. భర్తకు షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్..

ఇన్ని రికార్డ్ లు సాధించిన ఈసినిమా బాలయ్య యాక్టింగ్ తో పాటు.. ఆయన ఇమేజ్.. డైలాగ్స్.. సాంగ్స్.. ఫ్యాక్షన్ బ్యాగ్ గ్రౌండ్.. ఇలా అనేక కారణాలతో  సమరసింహా రెడ్డి ఇంత హైలెట్ అయ్యిందని చెప్పవచ్చు. తొడకొట్టడం, మీసం తిప్పడం లాంటి రాయలసీమ మ్యానరిజాలను ఈసినిమా ద్వారా హైలెట్ చేయడంతో పాటు.. సీమలో బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు కూడా. 
 

అయితే విచిత్రం ఏంటంటే..  మూవీలో హీరో క్యారెక్ట‌ర్ కు ఫ‌స్ట్ ఛాయిస్ బాల‌య్య కాదట. ఈ సినిమా కథ ముందు వెంకటేష్ దగ్గరకు వెళ్ళిందట. బీ గోపాల్ ఈ కథను విక్టరీవెంకటేష్ కు వినిపించారట. అయితే వెంకీకి ఈ కథ విపరీతంగా నచ్చింది. కాని ఇంత ఫ్యాక్షన్ ఉన్న కథ తనకు సూట్ అవ్వదని.. దానికి బాలయ్యే కరెక్ట్ అని వెంకీ అన్నారట. దాంతో ఈ స్టోరీ బాలృష్ణ దగ్గరకు రావడం... హిట్ కొట్టడం జరిగిపోయింది. 
 

Daggubati Venkatesh

ఇక ఆతరువాత వరుస ఫ్యాషన్ సినిమాలతో బాలయ్య బాబు వీర విహారం చేశారు. ప్రస్తుతం వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు బాలకృష్ణ. ప్రస్తుతం మెగా డైరెక్టర్ బాబీతో సినిమా చేస్తున్నాడు బాలయ్య. అటు వెంకీ కూడా తనకు సూటయిన సినిమాలతో అడపా దడపా పలకరిస్తున్నారు. 
 

Latest Videos

click me!