Rajinikanth: అతని పేరు చెప్పగానే భయంతో వణికిపోయిన రజినీకాంత్, చేతిలో సిగరెట్ పడేసి ఏం చేశాడంటే? తనికెళ్ల భరణి చెప్పిన సీక్రెట్..

Published : Sep 25, 2026, 02:24 PM IST

Rajinikanth: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు.. బాలీవుడ్ లో కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఎంతో గౌరవం ఇస్తుంటారు. తలైవా కనిపిస్తే లేచి నిల్చుంటారు. అటువంటిది ఓ వ్యక్తి పేరు చెపితేనే చాలు రజినీకాంత్ కూర్చున్నవాడు లేచి నిల్చుంటాడని తెలుసా? అతనెవరంటే?

PREV
15
ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్..

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్‌స్టార్ రజినీకాంత్ గురించి ప్రతీ ఒక్కరికి తెలుసా? ఆయన సినిమాలు, స్టైల్, మంచితనం, నటన, ఇలా అన్ని విషయాల్లో ఇష్టపడనివారు ఉండరు. తనకంటే చిన్నవారిని కూడా గౌరవించడం తలైవాకు అలవాటు. ఇక పెద్దవారిని ఆయన గౌరవించే తీరు ముచ్చటగా ఉంటుంది. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా.. లక్షల మంది ఆడియన్స్ ఉన్నా.. అక్కడ తన గురువు కానీ, అన్న కానీ ఉంటే వెంటనే కాళ్లకు నమస్కారం చేస్తారు రజినీకాంత్. పెద్దలు, గురువుల పట్ల ఆయనకు ఉన్న అపారమైన గౌరవం గురించి ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ నటుడు, రచయిత , దర్శకుడు తణికెళ్ల భరణి రజినీకాంత్‌తో తనకున్న అనుబంధం గురించి, రజినీకాంత్ ఎవరి మాట వింటే భయంతో లేచి నిల్చుంటారు అన్న విషయాలను ప్రస్తావించారు.

25
భాషా షూటింగ్ రజినీకాంత్ ను కలిసి భరణి..

తణికెళ్ల భరణి రజినీకాంత్ గురించి చాలా విషయాలు పంచుకున్నారు. దర్శకుడు సురేష్ కృష్ణతో 'అమ్మ' అనే సినిమా చేస్తున్న సమయంలో, చెన్నైలో రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఐకానిక్ చిత్రం 'భాషా' షూటింగ్ కూడా జరుగుతోంది. సురేష్ కృష్ణని కలవడానికి వెళ్లిన భరణిని డైరెక్టర్ సురేష్ రజినీకాంత్‌కు పరిచయం చేశారు. "ఈయన భరణి, మంచి రైటర్ - యాక్టర్" అని పరిచయం చేశారు.

35
గురువు రాజా రామదాస్ పేరు వినగానే కంగారుపడ్డ రజినీకాంత్..

ఆ సమయంలో రజినీకాంత్ భాష సినిమాలో ఫేమస్ సీన్ మెట్ల షాట్ పూర్తి చేసి వచ్చి ప్రశాంతంగా కూర్చుని సిగరెట్ వెలిగిస్తున్నారు. సంభాషణను ఎలా కొనసాగించాలా అని ఆలోచించిన తణికెళ్ల భరణి.. రజినీకాంత్‌తో "సార్.. మీరు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నప్పుడు మీకు యాక్టింగ్ నేర్పించిన 'రాజా రామదాస్' గారే నాకు కూడా ఇక్కడ గురువు" అని చెప్పారు. ఆ మాట వినగానే రజినీకాంత్ చేతిలో వెలుగుతున్న సిగరెట్‌ను భయంతో.. పక్కకు పడేసి.. వెంటనే గురుభక్తితో ఎంతో వినయంగా నిలబడ్డారు. "రాజారామదాస్ గారు చాలా గొప్ప వ్యక్తి సార్, ఆయన నాకు ఎంతో సహాయం చేశారు" అని రజినీకాంత్ ఎంతో ఆత్మీయంగా స్మరించుకున్నారు.

45
షాక్ లో తనికెళ్ల భరణి..

రజినీకాంత్ చేసిన పని చూసి.. తనికెళ్ల భరణి షాక్ అయ్యాడు. రాజా రామదాస్ అక్కడ లేకపోయినప్పటికీ, ఆయన పేరు వినగానే ప్రత్యక్షంగా గురువు ఎదురుగా ఉన్నంత గౌరవాన్ని రజినీకాంత్ ప్రదర్శించారని, పేరు వినగానే లేచి నిల్చోడం.. తాగుతున్న సిగరెట్ పక్కన పడేయడం.. ఎంతో గొప్పవిషయమని భరణి అన్నారు. రజినీకాంత్ ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రాజా రామదాస్ కుటుంబానికి, ఆయన పిల్లల చదువులకు రజినీకాంత్ లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారని తనికెళ్ల భరణి వెల్లడించారు.

55
రజినీకాంత్‌తో ఫ్రెడ్షిప్..

ఈ సంఘటన తర్వాత వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. తమిళ చిత్రం 'గిల్లీ' 200 రోజుల వేడుకలో రజినీకాంత్ చేతుల మీదుగా తణికెళ్ల భరణి షీల్డ్ అందుకున్నారు. తరువాత జగపతి బాబు-రజినీకాంత్ కాంబినేషన్ కథానాయకుడు సినిమాలో రజినీకాంత్ అసిస్టెంట్‌గా భరణి నటించారు . ఆ సమయంలో రజినీకాంత్ పెద్ద పెద్ద డైలాగ్‌లు చెప్పడానికి వీలుగా తెలుగు సంభాషణలను సులభతరం చేస్తూ ఆయనకు అందించేవారు. సూపర్‌స్టార్‌గా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నప్పటికీ, విద్య నేర్పిన గురువు పట్ల రజినీకాంత్ చూపించే భక్తి, వినయమే ఆయనను నిజమైన సూపర్‌స్టార్‌గా నిలబెట్టిందని తణికెళ్ల భరణి కొనియాడారు.

Read more Photos on
click me!

Recommended Stories