Naa Anveshana: నా అన్వేషణ ఫేమ్, ఫేమస్ ట్రావెల్ వ్లాగర్, ప్రపంచ యాత్రికుడు, వివాదాస్పద యూట్యూబర్.. ఇన్ని ట్యాగ్ లు ఉన్న ఏకైక వ్యక్తి అన్వేష్. రీసెంట్ గా ఆయన మరో సంచలన వీడియో తో సందడి చేశాడు. కోటీశ్వరుడిని ఎలా అయ్యానో తెలుసా అని వీడియో రిలీజ్ చేశాడు.
ప్రస్తుత సమాజంలో సులువుగా కోటీశ్వరులు కావాలని, జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే, ధనవంతులు కావడానికి కేవలం తెలివితేటలు, అదృష్టం మాత్రమే ఉంటే సరిపోవని, అసలైన సూత్రం ‘క్రమశిక్షణ’ (Discipline) మాత్రమేనని ప్రముఖ ట్రావెల్ వ్లాగర్, ‘నా అన్వేషణ’ ఫేమ్ అన్వేష్ (ప్రపంచ యాత్రికుడు) తేల్చి చెప్పారు తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ, ఒక సామాన్యుడి నుండి కోటీశ్వరుడిగా ఎదిగిన క్రమంలో తనకు క్రమశిక్షణ ఎలా ఉపయోగపడిందో వివరించారు.
24
నేనొక వెధవ.. పోరంబోకుని
అన్వేష్ మాట్లాడుతూ.. ''చిన్నతనంలో నేనొక వెధవ.. పోరంబోకులా ఉండేవాడిని, ఏమాత్రం క్రమశిక్షణ ఉండేది కాదు. అందుకే నా తల్లిదండ్రులు తన్ను హాస్టల్‌లో చేర్పించారు. ఆ నిర్ణయమే నా జీవితాన్ని మలుపు తిప్పింది. గత ఏడేళ్లుగా ప్రపంచ యాత్ర చేస్తున్న సమయంలో నేను ఎక్కువగా హాస్టళ్లలోనే గడుపుతున్నాను. హాస్టల్‌లో ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మందితో కలిసి రూమ్‌ను పంచుకోవాల్సి వచ్చినప్పుడు, ఆటోమేటిక్‌గా ఒక పద్ధతి అలవాటవుతుంది'' అని అన్వేష్ అన్నాడు.
హాస్టల్ జీవితం నేర్పిన డిసిప్లిన్
''షూస్ ఎక్కడ పెట్టాలి, చెత్త ఎక్కడ వేయాలి, బట్టలు ఎంత నీట్‌గా ఉంచుకోవాలి అనే విషయాలు తోటి సభ్యుల వల్ల అలవాటవుతాయి.ఇంట్లో అయితే కుటుంబ సభ్యులు పనులు చేసిపెడతారు, కానీ హాస్టల్‌లో వాష్‌రూమ్స్ లేదా కిచెన్ ఉపయోగించిన తర్వాత నీట్‌గా క్లీన్ చేయకపోతే తోటివాళ్ళు ప్రశ్నిస్తారు. వస్తువులను నీట్‌గా లేబుల్ చేసుకోవడం, ప్రతీ పనిలో బాధ్యతగా ఉండడం వంటివి ఇతరులను చూసి నేర్చుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఇంట్లో ఉంటే రావు.. హాస్టల్ లో ఉంటేనే అలవాటు అవుతుంది.'' అని అన్వేష్ తన వీడియో ద్వారా సందేశం ఇచ్చాడు.
34
లగ్జరీ లైఫ్ వద్దు.. క్రమశిక్షణే ముద్దు..
తన దగ్గర ఉన్న డబ్బుతో లగ్జరీ ఫైవ్ స్టార్ హోటళ్లలో హాయిగా ఉండగల స్థోమత ఉన్నప్పటికీ, తానలా చేయనని అన్వేష్ చెప్పారు. లగ్జరీ హోటళ్లలో ఉంటే మనిషిలో ఉన్న క్రమశిక్షణ సడలిపోయే ప్రమాదం ఉందని, అందుకే ఇప్పటికీ రోజుకు రూ. 400 చౌకైన బ్యాక్‌ప్యాకింగ్ హాస్టళ్లలోనే ఉంటున్నట్లు వెల్లడించారు. తోటి మనుషులతో కలిసి ఉండడం వల్ల క్రమశిక్షణ తప్పుకుండా, నేలమీద నిలబడే తత్వం అలవడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పిల్లలలో క్రమశిక్షణ లోపిస్తే వారిని హాస్టళ్లలో ఉంచాలని అన్వేష్ సూచించారు. అలాగే పెద్దవాళ్ళు కూడా జీవితంలో క్రమశిక్షణను అలవర్చుకోవాలనుకుంటే బ్యాక్‌ప్యాకింగ్ హాస్టల్స్‌లో సమయం గడపాలని చెప్పాడు. జీవితంలో ఏ స్థాయికి ఎదిగినా క్రమశిక్షణ, సామాజిక బాధ్యత లేకపోతే సాధించిన విజయం నిలవదని, అదే అసలైన విజయ రహస్యమని ‘నా అన్వేషణ’ అన్వేష్ ఈ సందేశం ద్వారా స్పష్టం చేశాడు.