ఇళయరాజా సంగీత దర్శకుడిగా పరిచయమైన తొలి సినిమా 'అన్నకిళి'. ఈ సినిమా వెనుక ఓ తెలుగు గాయని పాత్ర చాలా ఉందని మీకు తెలుసా. ఈ సినిమా వెనుకు ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటంటే?
తమిళ సినీ పరిశ్రమలో 'ఇసైజ్ఞాని'గా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఇళయరాజా ప్రయాణం మొదట్లో అంత సులువుగా సాగలేదు. 1970లలో నిర్మాత పంజు అరుణాచలం ఒక పల్లెటూరి నేపథ్యంలో సినిమా తీయాలనుకున్నారు. దేవరాజ్-మోహన్ దర్శకత్వంలో, ఆర్. సెల్వరాజ్ కథతో 'అన్నకిళి' సినిమాను మొదలుపెట్టారు. నిజానికి అప్పటికే గాయకుడిగా మంచి ఫామ్ లో ఉన్న ఎస్పీ బాలు ఇళయారాజాను ప్రోత్సహించి.. అవకాశాలు కల్పించాడని అంటుంటారు. కానీ ఇక్కడ మరో కొత్త కథ కూడా వైరల్ అవుతోంది. అదేంటంటే?
26
ఇళయరాజా పేరు ఎలా వచ్చిందంటే?
అన్నకిళి సినిమాలో శివకుమార్, సుజాత హీరోహీరోయిన్లుగా నటించారు. అయితే ఈసినిమా ద్వారా కొత్త సంగీత దర్శకుడిని పరిచయం చేయాలని పంజు అరుణాచలం భావించారు. అప్పుడు కథా రచయిత సెల్వరాజ్, 'రాజా' అనే యువకుడిని ఆయనకు పరిచయం చేశారు. రాజా కంపోజ్ చేసిన కొన్ని ట్యూన్లు విని పంజు అరుణాచలం చాలా ఇంప్రెస్ అయ్యారు. అప్పటికే ఇండస్ట్రీలో 'రాజా' పేరుతో మరొకరు ఉండటంతో, ఈ యువకుడికి 'ఇళయరాజా' అని ఆయనే పేరు పెట్టారు.
36
ఇళయరాజా వైపు నిలబడ్డ పంజు అరుణాచలం..
అయితే ఈ కొత్త సంగీత దర్శకుడిని దర్శకులు వెంటనే ఒప్పుకోలేదు. అతని టాలెంట్‌పై పూర్తి నమ్మకం లేక, వేరే మ్యూజిక్ డైరెక్టర్‌ను పెట్టుకుందామని సూచించారు. కానీ, పంజు అరుణాచలం మాత్రం ఈ సినిమాకు ఇళయరాజానే సరైనోడని బలంగా నిలబడ్డారు. దీంతో దర్శకులు ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించారు. ఒక కల్యాణ మండపంలో చిన్న మ్యూజిక్ ప్రోగ్రాం పెట్టి, అక్కడ ఇళయరాజా తన పాటలతో టాలెంట్ నిరూపించుకోవాలని చెప్పారు.
ఆ కార్యక్రమానికి అప్పటి స్టార్ సింగర్ ఎస్. జానకి రావడం ఓ విశేషం. సాధారణంగా పెద్ద గాయకులు ఇలాంటి టెస్ట్ ప్రోగ్రామ్‌లకు రారు. కానీ, ఒక టాలెంట్ ఉన్న యువకుడికి అవకాశం పోకూడదనే ఉద్దేశంతో ఆమె వచ్చారని చెబుతారు. ఆ మ్యూజిక్ ప్రోగ్రామ్‌లో ఇళయరాజా కంపోజ్ చేసిన ట్యూన్స్ అందరినీ కట్టిపడేశాయి. ఆ తర్వాతే 'అన్నకిళి' సినిమాకు ఆయన అధికారికంగా మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు.
56
మొదటి ఐదు పాటలూ సూపర్ హిట్
ఈ సినిమా కోసం ఇళయరాజా కంపోజ్ చేసిన ఐదు పాటలూ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా 'అడి రాక్కాయి మూక్కాయి', 'అన్నకిళి ఉన్నై తేడుదే', 'మచ్చాన పార్థీంగళా', 'సొందం ఇల్లై బందం ఇల్లై' వంటి పాటలు ఊరూవాడా మార్మోగాయి. ఈ సినిమా తొలి పాట రికార్డింగ్ సమయంలో కరెంట్ పోవడంతో పని మధ్యలోనే ఆగిపోయింది. రెండోసారి ప్రయత్నించినప్పుడు సౌండ్ సిస్టమ్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. మూడో ప్రయత్నంలో పాటను విజయవంతంగా రికార్డ్ చేశారు.
66
బ్లాక్ బస్టర్ హిట్ సినిమా..
1976 మే నెలలో 'అన్నకిళి' సినిమా రిలీజైంది. తక్కువ బడ్జెట్ సినిమా కావడంతో మొదట్లో డిస్ట్రిబ్యూటర్లు కొనడానికి వెనుకాడారు. దీంతో చాలా తక్కువ ధరకే అమ్మాల్సి వచ్చింది. మొదటి రోజు థియేటర్లలో పెద్దగా స్పందన రాలేదు. కానీ, మౌత్ టాక్‌తో సినిమా నెమ్మదిగా పుంజుకుంది. ముఖ్యంగా వారపత్రికల్లో వచ్చిన పాజిటివ్ రివ్యూలు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఆ తర్వాత 'అన్నకిళి' తమిళనాడు అంతటా హిట్టై, చాలా థియేటర్లలో 100 రోజులకు పైగా ఆడింది.