Surekha Konidela: చిరంజీవి భార్య సురేఖ ముందు డ్రామాలు ఆడిన నటుడు.. ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది

Published : May 29, 2026, 10:46 AM IST

చిరంజీవి భార్య సురేఖని సరదాగా ఆటపట్టించిన సంఘటనని ఓ నటుడు గుర్తు చేసుకున్నారు. చిరంజీవి ప్లాన్ ప్రకారమే తాము అలా చేసినట్లు ఆ నటుడు తెలిపారు. ఇంతకీ ఆ నటుడు ఎవరు, ఆ సంఘటన ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి అందరితో చాలా సరదాగా ఉంటారు. ఇండస్ట్రీలో చాలా మందితో చిరంజీవికి మంచి సాన్నిహిత్యం ఉంది. వారిలో బ్రహ్మానందం, అలీ లాటి కమెడియన్లు కూడా ఉన్నారు. అలీ ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి ఫ్యామిలీతో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకున్నారు.

25
చిరు ఇంటికి కమెడియన్ అలీ

ఆ సంఘటనతో చిరంజీవి గారి భార్య సురేఖ గారు చాలా భయపడిపోయారు అని అలీ తెలిపారు. నేను ఒకసారి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాను. అప్పటికే అక్కడ బ్రహ్మానందం గారు ఉన్నారు. చిరంజీవి గారు కింద కూర్చుని ఉన్నారు. నేను వెళ్ళగానే చిరంజీవి గారు నాతో ఇలా అన్నారు. ఇప్పుడు మా ఆవిడ సురేఖ వస్తుంది.

35
సురేఖ రాగానే డ్రామా మొదలు

నువ్వు తాగినట్లు నటించు. కానీ కంట్రోల్ గా ఉన్నట్లు నటించు. తూలిపోతున్నట్లు ఉంటూ మళ్ళీ స్టడీగా నిలబడు అని చెప్పారు. చిరంజీవి గారు పిలవగానే వదిన సురేఖ గారు వచ్చారు. ఇదిగో ఇతనే అలీ అని పరిచయం చేశారు. అలీ నాకెందుకు తెలియదు. నాన్నగారు అల్లు రామలింగయ్య గారితో కూడా నటించారు అని ఆమె అన్నారు.

45
సురేఖ నమ్మేశారు

నేను వెంటనే బాగా తాగేసిన తాగుబోతు ఎలా మాట్లాడతాడో అలా మత్తులో ఉన్నట్లు మాట్లాడుతూ.. అమ్మా నమస్కారం అంటూ ఊగిపోతూ మాట్లాడాను. దెబ్బకు ఆమె భయపడిపోయారు. ఏ అలీ కంట్రోల్ అని అంటున్నారు. ఇది చాలా ఏళ్ళ క్రితం జరిగింది. అప్పటికి నేను యంగ్ ఏజ్ లోనే ఉన్నాను. నేను నిజంగా తాగేసినట్లు సురేఖ గారు నమ్మేశారు.

55
ట్విస్ట్ రివీల్ చేసిన చిరంజీవి

ఎందుకు ఇంత చిన్న వయసులో తాగుడు అలవాటు చేసుకున్నాడు అని చిరంజీవి గారితో అన్నారు. దీనితో చిరంజీవి సురేఖతో అసలు ట్విస్ట్ రివీల్ చేస్తూ అదంతా డ్రామా అని తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories