Peddi piracy: పెద్ది రిలీజ్ కు ముందే ఐబొమ్మా కు షాక్, పైరసీపై మద్రాస్ హైకోర్డ్ సంచలన తీర్పు..

Published : May 29, 2026, 10:51 AM IST

రిలీజ్ కు ముందే పెద్ది సినిమాకు బిగ్ రిలీఫ్ వచ్చింది. పైరసీ సైట్లకు పెద్ద షాక్ ఇస్తూ.. హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా ఐబొమ్మాకు చుక్కలు చూపించే విషయం ఏంటంటే? 

PREV
16
భారీ రిలీజ్ కు రెడీగా రామ్ చరణ్ పెద్ది..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌, పాటలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. అయితే రిలీజ్ కు సబంధించి రీసెంట్ గా కొన్ని కాంట్రవర్సీలు రాగా... అవి కూడా క్లియర్ అవ్వడంతో మూవీ టీమ్ ఫుల్ జోష్ మీద ఉంది. అంతే కాదు తాజాగా పెద్ది టీమ్ కు మరో గుడ్ న్యూస్ కూడా అందింది.

26
పైరసీపై దృష్టి పెట్టిన పెద్ది టీమ్..

పైరసీ ప్రమాదాన్ని అడ్డుకునేందుకు పెద్ది యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది.‘పెద్ది’ సినిమాకు సంబంధించి పైరసీని అరికట్టేందుకు మద్రాస్ హైకోర్టు వెకేషన్ బెంచ్ తాజాగా పటిష్టమైన యాంటీ పైరసీ ఇంజంక్షన్  ఉత్తర్వులను జారీ చేసింది. సినిమా విడుదల తర్వాత అక్రమంగా ఇంటర్నెట్‌లో లీక్ చేయడం, కాపీ చేయడం లేదా ప్రసారం చేయడం పూర్తిగా నిషేధించబడిందని కోర్టు స్పష్టం చేసింది.

36
మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశం..

చిత్ర నిర్మాణ సంస్థకు పైరసీ వల్ల భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ రక్షణ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఐ బొమ్మా లాంటి పైరసీ వెబ్‌సైట్ల వల్ల ఎంత నష్టం జరుగుతుందో అందరికి తెలిసిందే. ఒకసారి వాటిని బ్లాక్ చేసిన తర్వాత కూడా కొత్త యూఆర్‌ఎల్‌లతో మళ్లీ కొత్తగా వాటి కార్యకలాపాలు కొనసాగిస్తుండటంతో.. వాటిని దృష్టిలో పెట్టుకుని కోర్టు ‘డైనమిక్ ఇంజంక్షన్’ ఆర్డర్‌ను కూడా అమలు చేసింది.

46
ఐబొమ్మా కు పెద్ది టీమ్ షాక్..

ఈమధ్య కాలంలో ఐబొమ్మా విషయంలో చాలా రచ్చ జరిగింది. ఈ సైట్ ఓనర్ రవిని అరెస్ట్ చేశారి రిమాండ్ లో ఉంచారు. సైట్ ను బ్యాన్ చేశారు. అయినా సరే ఆమధ్య ఐబొమ్మా మళ్లీ ఆన్ లైన్ లో కనిపించింది. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు అందులో దర్శనం ఇచ్చాయి. దాంతో ఈసారి మరింత బంధోబస్త్ గా పైరీసిన అరికట్టేందుకు డైనమిక్ ఇంజంక్షన్’ ఆర్డర్‌ను హైకోర్టు అమలు ఉత్తర్వులు ఇచ్చింది. దీని ద్వారా కొత్త పేర్లతో వచ్చే పైరసీ సైట్లను కూడా ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది.

56
కోర్టులను ఆశ్రయిస్తున్న నిర్మాణ సంస్థలు..

ఇటీవల దళపతి విజయ్ నటించిన ‘జననాయగన్’ మూవీ విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో లీక్ కావడం సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ సంఘటన తర్వాత పలు నిర్మాణ సంస్థలు తమ సినిమాలకు ముందస్తు న్యాయపరమైన రక్షణ కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నాయి. ఇదే తరహాలో ‘పెద్ది’ మూవీ టీమ్ కూడా ముందుగానే న్యాయపరమైన చర్యలు చేపట్టడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది.

66
భారీ అంచనాలు క్రియేట్ చేసిన పెద్ది..

కోర్టు ఇచ్చిన ఈ కీలక ఆదేశాలతో ‘పెద్ది’ సినిమాకు పైరసీ ముప్పు తగ్గినట్లయిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఎలాంటి లీకుల భయం లేకుండా సినిమా థియేటర్లలో విడుదలై భారీ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమవుతున్న పెద్ది సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories