హీరోయిన్ గా నయనతార కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్. చంద్రముఖి, గజినీ చిత్రాల సక్సెస్ తో ఆమె పరిశ్రమలో నిలదొక్కుకుంది. లక్ష్మి, యోగి, దుబాయ్ శ్రీను, అదుర్స్ వంటి హిట్ చిత్రాలతో తెలుగులో కూడా పాపులారిటీ తెచ్చుకుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో నయనతార లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. నటిగా హైట్స్ చూసిన నయనతార వ్యక్తిగత జీవితంలో మాత్రం అన్నీ వివాదాలే. ముఖ్యంగా రెండు పర్యాయాలు ఆమె ప్రేమలో విఫలం చెందింది.