ది రాజా సాబ్ విడుదలై 4 రోజులైంది. ఈ సినిమాకు నెగెటీవ్ రివ్యూస్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ దగ్గర మాత్రం బాగానే నడుస్తోంది. ప్రభాస్ మారుతీ కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమా కలెక్షన్ల వివరాలు చూస్తే..
పాన్ ఇండియా హీరో ప్రభాస్, కామెడీ సినిమాల దర్శకుడు మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన సనిిమా 'ది రాజా సాబ్.' జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజయిన ఈ సినిమా చూశాక.. చాలామంది కథ బలహీనంగా ఉందని విమర్శించారు. ప్రభాస్ లాంటి స్టార్ ఇలాంటి సినిమా ఎలా చేశారని అన్నారు.
24
సోమవారం రాజాసాబ్ కలెక్షన్లు
ప్రభాస్ 'ది రాజా సాబ్' మొదటి సోమవారం కలెక్షన్ల వివరాలు బయటకు వచ్చాయి. sacnilk.com ప్రకారం, ఈ సినిమా 6.6 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 114.6 కోట్లు సంపాదించింది రాజాసాబ్ సినిమా.
34
మొదటి రోజు నుంచి ఎంత కలెక్ట్ చేసిందంటే?
ప్రభాస్ రాజాసాబ్ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. మొదటి రోజు మంచి స్పందన రావడంతో.. 53.75 కోట్లు, రెండో రోజు భారీగా తగ్గి 26 కోట్లు, మూడో రోజు 19.1 కోట్ల వసూలు చేసింది. కలెక్షన్లు తగ్గినప్పటికీ, సినిమా 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరింది.
'ది రాజా సాబ్' సినిమా వరల్డ్‌వైడ్ కలెక్షన్ చూస్తే, ఇప్పటివరకు 188.4 కోట్లు సంపాదించింది. ఇండియాలో గ్రాస్ కలెక్షన్ 137.00 కోట్లు కాగా, ఓవర్సీస్‌లో 31.80 కోట్లు వసూలు చేసింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ హారర్ కామెడీ సినిమాను... పీపుల్ మీడియా ఫ్యాక్టరీ450 కోట్ల బడ్జెట్ తో నిర్మించింది. ప్రభాస్, సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కీలక పాత్రల్లో నటించారు.