ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒకే ఒక్క సినిమా గురించి డిస్కషన్ నడుస్తోంది. అదే `ది ఒడిస్సీ`. ది గ్రేడ్ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన చిత్రమిది. ఇందులో హాలీవుడ్ స్టార్స్ మ్యాట్ డేమాన్, టామ్ హోలాండ్, అన్నే హత్వే, రాబర్ట్ పట్టిన్సన్, లుపితా నైయాంగ్, సమంత మార్టన్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. ఇది 2004లో వచ్చిన `ట్రాయ్` మూవీకి కొనసాగింపు అని చెప్పొచ్చు. క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన చిత్రాలకు మన ఇండియాలో మంచి క్రేజ్, డిమాండ్ ఉంటుంది. ఆయన గతంలో `మెమెంటో`, `ఇన్సోమ్నియా`, `బ్యాట్ మ్యాన్ బిగిన్స్`, `ది ప్రిస్టీజ్`, `ది డార్క్ నైట్`, `ఇన్సెప్షన్`, `ది డార్క్ నైట్ రైజెస్`, `ఇంటర్‌సెల్లార్`, `డంకిర్క్`, `టెనెట్`, `ఓపెన్‌హెమ్మర్` వంటి చిత్రాలను రూపొందించారు.