Lenin 10 Days Collections: పదో రోజు అఖిల్‌ దెబ్బకి బాక్సాఫీస్ షేక్‌.. `లెనిన్‌`కి టోటల్‌ కలెక్షన్లు ఎంతంటే?

Published : Jul 20, 2026, 08:16 AM IST

అక్కినేని అఖిల్‌ `లెనిన్‌` చిత్రంతో గత వారం ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రం హిట్‌ టాక్‌తో ప్రారంభమై కలెక్షన్ల పరంగా సత్తా చాటుతోంది. రెండో వారంలో జోరు చూపించడం విశేషం.

PREV
14
బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతున్న లెనిన్‌

అఖిల్‌ కి ఎట్టకేలకు ఏడో సినిమా విజయాన్ని అందించింది. ఏడో సినిమా చాలా మంది హీరోలకు బ్రేక్‌ ఇచ్చింది. వారిని స్టార్స్ ని చేసింది. ఇప్పుడు అఖిల్‌కి `లెనిన్‌` బ్రేక్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. మాస్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రారంభం నుంచే పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. అదే స్థాయిలో వసూళ్లు ఉన్నాయి. అఖిల్‌ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది. అంతేకాదు ఇప్పుడు రెండో వారంలో కూడా దుమ్ములేపుతోంది. అంతేకాదు ఈ వారం కూడా ఈ సినిమాకి అడ్డే లేదు.

24
లెనిన్‌ 10 రోజుల కలెక్షన్లు

అఖిల్‌ `లెనిన్‌` మూవీ ఆదివారంతో పది రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఎంత వసూలు చేసింది. సినిమా హిట్టా ఫట్టా అనేది చూస్తే, ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా పది రోజుల్లో రూ.63కోట్ల గ్రాస్‌ని సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఇది సుమారు రూ.47.50కోట్ల వరకు సాధించింది. ఆదివారం ఈ మూవీకి దాదాపు రూ.3కోట్లకు పైగానే వసూళ్లు రావడం విశేషం. దీంతో సినిమా మరోసారి దుమ్మురేపిందని చెప్పొచ్చు. రెండో వారంలో ఈ స్థాయి కలెక్షన్లు అంటే సినిమా ఇంకా స్ట్రాంగ్‌గా ఉన్నట్టే లెక్క. ఇదిలా ఉంటే టీమ్ ప్రకటించిన లెక్కల ప్రకారం ఇది దాదాపు రూ.80-90 కోట్లు సాధించింది.

34
అఖిల్‌ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌

`లెనిన్‌` మూవీ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్ చాలా తక్కువగానే ఉంది. సుమారు రూ.22కోట్లు అని సమాచారం. ఈ లెక్కన ఈ సినిమాకి ఇప్పటికే ముప్పై కోట్లకుపైగా షేర్‌ కలెక్షన్లు వచ్చాయి. అంటే ఇది రూ.8-10కోట్ల వరకు లాభాల్లోకి వెళ్లింది. చాలా వరకు నిర్మాతలు నాగవంశీ, నాగార్జున సొంతంగా ఈ సినిమాని రిలీజ్‌ చేశారు. కాబట్టి రికవరీ ఈజీ అయ్యిందని చెప్పొచ్చు. సినిమాకి అయిన బడ్జెట్‌ రూ.55కోట్లు అని సమాచారం. నాన్ థియేట్రికల్ గా దీనికి బాగానే(సుమారు రూ.30కోట్లు) వచ్చిందట. ఓవరాల్‌గా `లెనిన్‌` నిర్మాతలకు ప్రాఫిట్‌ ప్రాజెక్ట్ గా నిలిచింది. అదే సమయంలో అఖిల్‌ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌ గా నిలిచింది.

44
లెనిన్‌ మూవీ టీమ్‌, స్టోరీ

అఖిల్‌ హీరోగా రూపొందిన `లెనిన్‌` మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించారు. నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. చిత్తూరి జిల్లా శ్రీరామపురంలో ఈ కథ జరుగుతుంది. అక్కడ భరతం మిట్టా అనే జాతర చాలా ఫేమస్‌. అందులో ధర్మరాజు కిరీటం కోసం పోటీ ఉంటుంది. ఊరు పెద్ద అయిన ఈశ్వరీరావు దాన్ని నిర్ణయిస్తుంది. ఆమె నమ్మిన బంటు లెనిన్‌(అఖిల్‌). అతను భారతి(భాగ్యశ్రీ బోర్సే)ని ప్రేమిస్తాడు. కానీ ఆమెపై లెనిన్‌ ఫ్రెండ్‌(ప్రమోద్‌) మనసు పడతాడు. ఆమెని దక్కించుకోవడం ఆడిన యాక్షన్‌ డ్రామానే ఈ మూవీ. మన తన ప్రియురాలి కోసం లెనిన్‌ ఎలాంటి పోరాటం చేశాడనేది సినిమా. విలేజ్‌ డ్రామా, యాక్షన్‌ ప్రధానంగా సినిమా సాగుతుంది. ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. కథగా ఇది కొంత రొటీనే అయినా, ఎంగేజ్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యింది. నటుడిగా అఖిల్‌కి మంచి మార్కులు పడ్డాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories