OTT: ఓటీటీలోకి టొవినో థామస్ థ్రిల్లర్, మిడిల్ ఏడ్జ్ జంట రొమాంటిక్ సిరీస్ కూడా.. ఈ వారం సూపర్ ఫన్ పక్కా

Published : Jul 20, 2026, 08:35 AM IST

ఈ వారం నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సోనీలివ్, యాపిల్ టీవీ+లో పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటి పూర్తి వివరాలు ఈ కథనంలో ఉన్నాయి.

PREV
16
OTT Movies

ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదం పంచేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. హిందీ డ్రామా 'ముసాఫిర్ కేఫే', 'ఆదర్శ్ బాల్ విద్యాలయ', టోవినో థామస్ నటించిన మలయాళ చిత్రం 'పళ్లి చట్టంబి', హాలీవుడ్ మిడిల్ ఏజ్డ్ రొమాంటిక్ సిరీస్ రాన్సమ్ క్యానియన్ సీజన్ 2 తో పాటు పలు సిరీస్‌లు వివిధ ఓటీటీల్లో విడుదల కానున్నాయి. ప్లాట్‌ఫామ్‌ల వారీగా పూర్తి వివరాలు ఇవే.

26
Netflix

ముసాఫిర్ కేఫే (Musafir Cafe)

రిలీజ్ డేట్ : జూలై 24 

ఎక్కడ చూడాలి : Netflix

విక్రాంత్ మాస్సే, పింటో, మహిమా మక్వానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హిందీ వెబ్‌సిరీస్ దివ్య ప్రకాశ్ దూబే రాసిన బెస్ట్‌సెల్లర్ నవల ఆధారంగా రూపొందింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చంద్ర్ జీవితంలో సుధా, ప్రీతి అనే ఇద్దరు మహిళల ప్రవేశంతో జరిగే పరిణామాల చుట్టూ కథ సాగుతుంది.

రాన్సమ్ క్యానియన్ సీజన్ 2 (Ransom Canyon Season 2)

రిలీజ్ డేట్ : జూలై 23 

ఎక్కడ చూడాలి : Netflix

టెక్సాస్‌లోని మూడు రాంచింగ్ కుటుంబాల రాజకీయాలు, తరాల మధ్య సంబంధాలు, సంక్లిష్టమైన కుటుంబ కథనాలతో ఈ డ్రామా కొనసాగుతుంది. రెండో సీజన్‌లో మరిన్ని ఆసక్తికరమైన మలుపులు ఉండనున్నాయి.

72 అవర్స్ (72 Hours)

రిలీజ్ డేట్ : జూలై 24 

ఎక్కడ చూడాలి : Netflix

కెవిన్ హార్ట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ కామెడీ చిత్రంలో తన కెరీర్‌ను కాపాడుకునేందుకు నలభై ఏళ్ల అధికారి యువకులతో కలిసి మూడు రోజుల బ్యాచిలర్ పార్టీకి వెళ్లాల్సి వచ్చే పరిస్థితి ఎదురవుతుంది.

ది డెట్ కలెక్టర్ (The Debt Collector)

రిలీజ్ డేట్ : జూలై 23 

ఎక్కడ చూడాలి : Netflix

థాయ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న మాజీ అప్పుల వసూలుదారు, హింసాత్మక రుణ ముఠాపై ప్రతీకారం తీర్చుకునేందుకు మళ్లీ నేర ప్రపంచంలోకి అడుగుపెడతాడు.

ఎలైట్ ఫోర్స్ (Elite Force)

రిలీజ్ డేట్ : జూలై 22 

ఎక్కడ చూడాలి : Netflix

ఫ్రెంచ్ యాక్షన్ సిరీస్ అయిన ఇందులో తన యూనిట్‌పై జరిగిన భారీ దాడి తర్వాత ఒక ఉన్నతాధికారి ప్రమాదకరమైన మిషన్‌కు నాయకత్వం వహిస్తూ తన గతాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఏ టాక్సిక్ లవ్ స్టోరీ (A Toxic Love Story)

రిలీజ్ డేట్ : జూలై 22 

ఎక్కడ చూడాలి : Netflix

నిజ జీవితంలో జరిగిన అనాహైమ్ క్రెయిగ్‌లిస్ట్ కేసు ఆధారంగా రూపొందిన ఈ ట్రూ-క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్‌లో కొత్తగా వివాహం చేసుకున్న యూఎస్ మార్షల్ దంపతులు స్టాకింగ్ కేసులో ఎలా చిక్కుకున్నారనే అంశాన్ని చూపిస్తారు.

36
Prime Video

ఆదర్శ్ బాల్ విద్యాలయ (Adarsh Baal Vidyalaya)

రిలీజ్ డేట్ : జూలై 24 

ఎక్కడ చూడాలి : Prime Video

కేకే మీనన్, నవీన్ కస్తూరియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ డ్రామాలో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రారంభించిన ఒక ప్రత్యేక కార్యక్రమం అనూహ్యమైన పరిణామాలకు దారితీయడంతో, ఉపాధ్యాయుల బృందం మొత్తం విద్యా వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నిస్తుంది.

46
JioHotstar

స్టువర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్ (Stuart Fails To Save The Universe)

రిలీజ్ డేట్ : జూలై 24 

ఎక్కడ చూడాలి : JioHotstar

'ది బిగ్ బ్యాంగ్ థియరీ'లోని ప్రముఖ పాత్రలు మళ్లీ కనిపించే ఈ సిరీస్‌లో స్టువర్ట్ బ్లూమ్ అనుకోకుండా మల్టీవర్స్ సంక్షోభాన్ని సృష్టించడంతో, దానిని సరిచేసేందుకు అతడు చేసే ప్రయత్నాలే కథ.

బ్లీచ్: థౌజండ్-ఇయర్ బ్లడ్ వార్ (Bleach: Thousand-Year Blood War – Final Season)

రిలీజ్ డేట్ : జూలై 25 

ఎక్కడ చూడాలి : JioHotstar

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ యానిమే చివరి కథాంశానికి సంబంధించిన నాలుగో, తుది సీజన్ ఈ వారం స్ట్రీమింగ్‌కు రానుంది.

56
SonyLIV

పళ్లి చట్టంబి (Pallichattambi)

రిలీజ్ డేట్ : జూలై 24 

ఎక్కడ చూడాలి : SonyLIV

టోవినో థామస్, కాయడు లోహర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మలయాళ చిత్రం 1950ల కేరళలో జరిగిన విమోచన సమరం నేపథ్యంలో సాగుతుంది. కమ్యూనిస్టు భూసంస్కరణలకు వ్యతిరేకంగా చర్చ్ నియమించిన యువకుడు క్రమంగా తన ఆలోచనా విధానాన్ని మార్చుకునే కథను ఇందులో చూపించారు.

66
Apple TV+

ది డింక్ (The Dink)

రిలీజ్ డేట్ : జూలై 24 

ఎక్కడ చూడాలి : Apple TV+

జేక్ జాన్సన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ కామెడీ చిత్రంలో గాయం నుంచి కోలుకుంటున్న మాజీ టెన్నిస్ ఆటగాడు పికిల్‌బాల్ క్రీడలో అడుగుపెట్టి ఎదుర్కొనే వినోదాత్మక సంఘటనలను చూపిస్తారు. బెన్ స్టిల్లర్, మేరీ స్టీన్‌బర్గెన్, ఎడ్ హారిస్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories