మనుషులు తినే వింత పర్వతం ఎక్కడుందో తెలుసా..? అందానికి అందం, రుచికి రుచి..

First Published | Dec 27, 2024, 10:55 PM IST

సాధారణంగా పర్వతాలు, కొండ ప్రాంతాలు పర్యటక ప్రదేశాలు గా ఉంటాయి. కాని ఓ ప్రాంతంలో ఉన్న పర్వాతాన్నిమనుషులు తింటారంటే మీరు నమ్ముతారా..? కాని ఇది నిజం ఇంతకీ ఎక్కడుంది ఆ పర్వతం అంత టేస్ట్ గా ఉంటుందా..? 
 

ఈ భూమిపై  టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా సరే.. వింతలు విడ్డూరాలకుఏమాత్రం కొదవ లేదు. ఎవరు కనిపెట్టలేని విచిత్రాలు చాలా ఉన్నాయి భూమి మీద. ఎవ్వరికి తెలియని ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. వాటి గురించి తెలిసినప్పుడు మాత్రం చాలా వింతగా అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి వింతలు ఉన్నయా అని అనిపిస్తుంది. ట్రావెలర్స్ కు మంచి ప్లేస్ కూడా దొరికినట్టు అవుతుంది. 

Also Read: మంచు కురిసే ఎడారిని ఎప్పుడైనా చూశారా..? ప్రపంచంలోనే అతి చిన్నఎడారిలో వింతలు , విశేషాలెన్నో.

సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తే..  పర్వతాల గురించి మీకు తెలిసే ఉంటుంది.  పర్వతాలు తెలియనివారు ఉండరు .. అవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. పర్వతాలలో కొన్ని ఎంతో అందంగా ఉంటాయి. వాటిని ఏమీ చేయలేరు.. కదిలించలేదు. అవి అలానే ఉంటాయి.  వాటిని పగలకొట్టి రాయిని బయటకు తీయ్యాలన్నా కూడా చాలా కఠినంగా ఉంటాయి. ఒక్కోసారి వాటిని విచ్ఛిన్నం చేయడం చాలా కష్టం. కొన్నిసార్లు కుదరదు కూడా. 

Also Read: ఆ ఊరిలో ఆడవారిదే పెత్తనం, మరి మగవారు ఏం చేస్తారో తెలుసా..?


కానీ నేను ఇప్పుడు చెప్పబోయే  పర్వతం గురించి తెలిస్తే మాత్రం కచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఆ పర్వంత స్పెషల్ ఏంటీ అంటే.. ఇక్కడి ప్రజలు ఈ పర్వతాన్ని చూస్తారు.. అలాగే తింటారు కూడా. పర్వతాన్ని తినడం ఏంటీ..? అని అనుకోవచ్చు కాని.. నమ్మలేకున్నా ఉన్నా ఇది నిజం. ఈ ప్రదేశం ఒక ద్వీపం. ఇది జంబూద్వీప్ నైరుతి విభాగంలో ఇరాన్ తీరానికి 8 కిలోమీటర్ల దూరంలో పెర్షియన్ గల్ఫ్ నీలి జలాల మధ్యలో ఉంది. 

ఈ ద్వీపం మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. కాదు కాదు నిజంగా మెస్మరైజ్ చేస్తుంది.  ఈ ద్వీపం పేరు హార్ముజ్ ద్వీపం దీనిని రెయిన్‌బో ద్వీపం అని కూడా పిలుస్తారు. ఈ దీవి అందం గురించి ప్రపంచానికి ఇంకా తెలియదు. ఈ ద్వీపాన్ని డిస్నీల్యాండ్ ఆఫ్ జియాలజిస్ట్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడి బంగారు కాలువలు, రంగురంగుల పర్వతాలు, అందమైన ఉప్పు గనులు ఇలా చాలా రరాకాల అందాలు మన మనస్సును ఆకర్షిస్తాయి. 

కేవలం 42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపం ఆకాశం నుంచి చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఇక్కడ అగ్నిపర్వత శిలలు, రాయి, మట్టి, ఇనుము ఎరుపు, పసుపు, రంగులలో మెరుస్తున్నప్పుడు.. ఇది భూమేనా లేక భూతలస్వర్గమా అనిపిస్తుంది. ఇది నిజంగా భూమి  కాదు మరొక ప్రపంచమేమో అని అనిపిస్తుంది. ఇక్కడి రాళ్లకి సూర్యుడి కిరణాలను తాకినప్పుడు అవి తళుక్కున మెరుస్తాయి. ఈ ద్వీపంలో 70 కంటే ఎక్కువ రకాల ఖనిజాలు ఉన్నాయి.

Also Read: 

ఈ ద్వీపం అందం గురించి తెలుసుకున్నాం కదా.. మరి ఈ ద్వీపం పుట్టు పూర్వత్రాలు  చూద్దాం. వేల సంవత్సరాల క్రితం ఐలాండ్  ఏర్పడింది. అగ్నిపర్వత శిలలు, ఖనిజాలు, ఉప్పు దిబ్బలు ఈ ద్వీపాన్ని అందంగా మార్చాయి . ఈ ద్వీపం గురించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే. ఇక్కడ ఉన్న పర్వతం ప్రపంచంలో తీనదగిన  ఏకైక పర్వతం. ఎందుకంటే ఈ పర్వతాలు మందపాటి ఉప్పు పొరలతో ఏర్పడి ఉంటాయి. 
 

వివిధ రకాల ఖనిజాల కారణంగా ఈ ద్వీపం నేల కూడా కారంగా ఉంటుంది. దీనిని ఆహారంలో మసాలాగా ఉపయోగిస్తారు. ఇక్కడి ప్రజలు ఎర్రమట్టిని చట్నీగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా స్థానిక కళాకారులు ఇక్కడ ఉన్న ఎర్రమట్టిని పెయింటింగ్‌లో ఉపయోగిస్తారు. ప్రజలు తమ బట్టలకు రంగు వేయడానికి దీనిని ఉపయోగిస్తారు. ఇలా ఇంకా ఎన్నో వింతలు ఉన్నాయి ఇక్కడ. 

Latest Videos

click me!