ఆ చిత్రాన్ని సీక్రెట్ గా కంప్లీట్ చేస్తున్న మెగాస్టార్.. ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్?

Published : Jun 14, 2022, 01:05 PM ISTUpdated : Jun 14, 2022, 01:10 PM IST

మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ తర్వాత వరుస చిత్రాలతో తన అభిమానులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం భోళా శంకర్, గాడ్ ఫాదర్ సినిమాల్లో నటిస్తున్న చిరు.. తన నెక్ట్స్ మూవీని కూడా సీక్రెట్ గా కంప్లీట్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. 

PREV
16
ఆ చిత్రాన్ని సీక్రెట్ గా కంప్లీట్ చేస్తున్న మెగాస్టార్.. ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్?

మెగా స్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత వరుసగా విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఇటీవల సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచార్య’ చిత్రంలో మెగా స్టార్ చిరంజీవి నటించారు. మోగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా నటించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.

26

కానీ భారీ అంచనాలతో రిలీజ్ అయిన ‘ఆచార్య’ మెగా అభిమానులను అప్సెట్ చేసింది. అనుకున్నట్టుగా సినిమా రాకపోవడంతో చిరు కూడా నిరాశ చెందారు. దీంతో ఈ సారి ఎలాగైనా మెగా అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టాలని ఫిక్స్ అయ్యాడు మెగాస్టార్. ఈ మేరకు తన అప్ కమింగ్ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టారు. 

36

ఇప్పటికే ‘గాడ్ ఫాదర్’ చిత్ర షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేశారు. తుది దశ చిత్రీకరణ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు రీసెంట్ గా టూర్ నుంచి తిరిగి వచ్చిన చిరు తాజాగా ‘భోళా శంకర్’ సెట్స్ కు హాజరయ్యారు. ఈ రెండు చిత్రాలపైనే అభిమానులు ప్రస్తుతం ఆశలు పెట్టుకున్నారు. 

46

ఇదిలా ఉంటే లేటెస్ట్ గా మెగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందింది. చిరు ‘భోళా శంకర్’ మరియు ‘గాడ్ ఫాదర్’ చిత్రాలతో పాటు సీక్రెట్ గా మెగా154 (Mega 154) చిత్రాన్ని కూడా పూర్తి చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మెగా154కు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు ఇటు చిరు, అటు డైరెక్టర్ బాబీ తెలిపారు. 
 

56

అయితే ఇప్పటికే ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ప్రారంభమైందని, చిరు సెట్స్ కు హాజరయ్యారని తెలుస్తోంది. అలాగే మరికొందరు నోటెడ్ యాక్టర్స్ తో దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) పలు కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారని టాక్ వినిపిస్తోంది. మూవీలో చిరు వింటేజ్ లుక్ మరియు మాస్, స్టైల్ మెగా అభిమానులకు ట్రీట్ గా ఉండనుందని ప్రచారం జరుగుతోంది.

66

Waltair Veerayya చిత్రానికి టైటిల్ ను ఇంకా అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. కానీ అభిమానుల కోసం ముందుగానే రివీల్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruthi Haasan) చిరు సరసన ఆడిపాడనుంది. సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందించనున్నాడు. 


 

click me!

Recommended Stories