Sneha: టీ షర్ట్, జీన్స్ లో షాకిస్తున్న హోమ్లీ బ్యూటీ.. స్నేహ హాట్ లుక్స్ ని క్లిక్ మనిపించిన భర్త

Published : Jun 14, 2022, 12:57 PM IST

ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులని మెప్పించింది స్నేహ.  వెంకీ, ప్రియమైన నీకు, శ్రీరామదాసు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో స్నేహ తనదైన ముద్ర వేసింది.

PREV
18
Sneha: టీ షర్ట్, జీన్స్ లో షాకిస్తున్న హోమ్లీ బ్యూటీ.. స్నేహ హాట్ లుక్స్ ని క్లిక్ మనిపించిన భర్త

నటి సౌందర్య తర్వాత హోమ్లీ క్వీన్ గా స్నేహ టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. స్నేహ తెలుగులో ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించింది. తొలి వలపు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది. 

28

ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులని మెప్పించింది స్నేహ.  వెంకీ, ప్రియమైన నీకు, శ్రీరామదాసు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో స్నేహ తనదైన ముద్ర వేసింది. ఆ టైంలో అలాంటి చిత్రాలకు స్నేహ మాత్రమే దర్శకుల ఛాయిస్. 

38

ప్రముఖ తమిళ నటుడు ప్రసన్నని స్నేహ 2012లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా స్నేహ సినిమాల్లో నటిస్తోంది. కాకపోతే ఆమెకు హీరోయిన్ గా ఆఫర్స్ రావడం లేదు. 

48

స్నేహ, ప్రసన్న దంపతులు అన్యోన్యంగా జీవిస్తున్నారు. స్నేహ తెలుగులో చివరగా వినయ విధేయ రామ చిత్రంలో మెరిసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో స్నేహ రాంచరణ్ కు వదిన పాత్రలో నటించి మెప్పించింది. తన కెరీర్ లో స్నేహ ఎప్పుడూ హద్దులు దాటేలా గ్లామర్ షో చేయలేదు. 

58

సోషల్ మీడియాలో స్నేహ యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబ విషయాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. వివాహం తర్వాత కూడా స్నేహ గ్లామర్ చెక్కు చెదరలేదు. ఇప్పటికీ స్నేహ అదే ఫిట్ నెస్ తో మెప్పిస్తోంది. స్నేహ తాను అందాల దేవత అని మరోసారి నిరూపించుకుంది. 

68

సాధారణంగా స్నేహ సాంప్రదాయ వస్త్రధారణలో, చీరకట్టులో అందంగా ఉంటుంది. మోడ్రన్ డ్రెస్సుల్లో సైతం తనకు తిరుగులేదని స్నేహ సోషల్ మీడియా వేదికగా నిరూపిస్తోంది. 

78

తాజాగా స్నేహ తనలోని కొత్త గ్లామర్ యాంగిల్ ని బయట పెట్టింది. స్నేహ వయసు రోజు రోజుకి తగ్గిపోతోంది. అంతలా స్నేహ గ్లామర్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. కళ్ళతోనే మన్మధ బాణాలు గుచ్చుతోందా అన్నట్లుగా స్నేహ ఫోజులు ఉన్నాయి. 

88

టీ షర్ట్, జీన్స్ ప్యాంట్ ధరించిన స్నేహ కళ్ళతోనే మ్యాజిక్ చేసేలా హాట్ ఫోజుల్లో అదరగొడుతోంది. స్నేహని జీన్స్ ప్యాంట్ లో ఇంత అందంగా ఫొటోస్ తీసింది ఎవరో కాదు.. ఆమె భర్త ప్రసన్న. స్నేహ, ప్రసన్న ప్రేమ వివాహం చేసుకుని అన్యోన్యంగా జీవిస్తున్నారు. 

click me!

Recommended Stories