SPB: ఎస్పీ బాలు షాకింగ్ ప్రేమకథ: ! ఎత్తుకుపోయి పెళ్లి,అప్పట్లో సెన్సేషన్

Published : Feb 24, 2025, 11:19 AM IST

దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రేమ వివాహం ఒక సంచలనంగా నిలిచింది. గోత్రం సమస్యగా మారడంతో, సావిత్రిని ఎత్తుకుపోయి సింహాచలంలో పెళ్లి చేసుకున్నారు బాలు.

PREV
14
SPB:  ఎస్పీ బాలు  షాకింగ్ ప్రేమకథ: ! ఎత్తుకుపోయి పెళ్లి,అప్పట్లో సెన్సేషన్
The Love Story & Marriage of Legendary Singer SPB in telugu jsp


తన సుమధుర గానంతో సంగీత ప్రియులనే కాకుండా సామాన్య శ్రోతలను సైతం అలరించారు దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. సంగీతం నేర్చుకోకపోయినా... దాదాపు యాభైవేల పాటల్నిపాడి గిన్నిస్‌ రికార్డు సాధించిన ఘనత ఆయనది. ఇక ఆయన పాటల్లో ప్రేమ గీతాలు, విరహ గీతాలది ప్రత్యేక స్దానం.

 అలా సినిమాల్లో ప్రేమించుకుని విరహంలో పడే హీరో, హీరోయిన్  యుగళగీతాలూ, విషాదగీతాలూ పాడి జనాన్ని మురిపించిన, మరపించిన గాయకుడు మన బాలు. మరి అతని సొంత ప్రేమానుభవం గురించి ఏమంటారు?

అప్పట్లో ఓ తమిళ పత్రికతో మాట్లాడుతూ ఆయన చెప్పిన ప్రేమ కథ షాకింగ్ గురి చేస్తుంది. ఆయన ధైర్యానికి ఆశ్చర్యపోయేలా చేస్తుంది. తన ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతదూరం అయినా వెళ్లాలనే ఆలోచన ఆ ప్రేమలోని తీవ్రతను తెలియచేస్తుంది. 

24
The Love Story & Marriage of Legendary Singer SPB in telugu jsp


ఎస్పీ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ... “నాకు ఓ తీయని అనుభవం వుంది. నాది ప్రేమ వివాహమే. నా ప్రేమ కాస్త గలాటా ప్రేమ. నా ప్రేమి కురాలిని చాటుగా తీసుకువెళ్ళిపోయి పెళ్ళాడవలసిన పరిస్థితి. నాకు దూర పు బంధువు అయిన అమ్మాయి సావిత్రి ని నేను ప్రేమించాను. ఇద్దరి ఇళ్ళూ పక్కపక్కనే వుండటం వల్ల, మా ప్రేమ అతివేగంగా పెరిగింది. అయితే మా పెళ్ళికి విలన్ మరెవరో కాదు, మా గోత్రమే!

నేనూ, సావిత్రీ సగో త్రికులం. శుద్ధశ్రోత్రియ బ్రాహ్మణులైన ఏ రెండు కుటుంబాల్లోనూ ఇలాంటి పెళ్ళి చేసు కోరు. పెద్దలూ అంగీకరించరు. ఆపైన ఏముందీ? సావిత్రి తల్లిదండ్రులు ఆమెను బెంగు ళూరులోని ఆమె అక్కగారింటికి పంపించేశారు. నేను గడ్డం పెంచుకుని, “ఓ సావిత్రీ...!”. అంటూ పాడే దేవదాసుగా మారాను. అయితే తాగటం మాత్రం చెయ్యలేదు.

34
The Love Story & Marriage of Legendary Singer SPB in telugu jsp


"ఆ తరువాత తెగించి, ఒక నిర్ణయం తీసుకున్నాను. సావిత్రిని, ఆమె అక్కగారింటి నుంచి ఎత్తుకుపోయి పెళ్ళాడటమే మేలని పథకం పన్ని స్నేహితులతో కారులో వారితోపాటు బెంగుళూరుకు వెళ్ళాను. నా పథకం వివరిస్తూ, సావిత్రికి ఓ ఉత్తరం పంపాను.

వారి వాకిట్లో వేచి వున్న మేము, ఆమె బయటికి రాగానే వెంటబెట్టుకొని, చెన్నయ్కి తిరిగి వెళ్ళాము. ఎక్కడ సావిత్రి తల్లిదండ్రులు మా ప్రేమను గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తారో అనే ఓ చిన్న భయం మమ్మల్ని వెంటాడుతూనే వుంది. వెంటనే పథకాన్ని మార్చాను. 

44
The Love Story & Marriage of Legendary Singer SPB in telugu jsp


నేరుగా సెంట్రల్ స్టేషనుకు వచ్చి, అక్కడినుంచి విశాఖపట్టణానికి రైలెక్కాం. సింహాచలంలో శ్రీ నరసింహస్వామి సన్నిధిలో, మిత్రులు సాక్షులుగా నేను, సావిత్రిని పెళ్ళాడాను. రెండు రోజుల తరువాత చెన్నయ్కి వెళ్ళాం. అవసరంలేని సమస్యలను తప్పించుకునేందుకు, ఓ హోటల్లో బస చేశాం.

నేను ట్యాక్సీలో వెళ్ళి పాటలు పాడి వచ్చేవాణ్ణి. ఒకరోజున మా గది తలుపులు ఎవరో తట్టారు. తెరిస్తే, మా నాన్నగారూ, సావిత్రి తల్లిదండ్రులూ నిలబడి వున్నారు. గత్యంతరం లేక వారు రాజీ పడ్డారు. ఇవాళ నేనూ, మా సావిత్రీ మనవడు, మన వరాళ్ళతో సంతోషంగా వుంటున్నాం” అన్నారు బాలు. ఆయన 1969లో వివాహం చేసుకున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories