Nani:జీరో నుంచి ఎదిగిన నాని రెమ్యునరేషన్, ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?
Nani: నటుడు నాని ప్రస్తుతం నటుడుగా, నిర్మాతగా దూసుకుపోతున్నారు. వరుస విజయాలతో ఆయన మార్కెట్ పెరిగింది. నాని ఆస్తులు, రెమ్యునరేషన్ వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Nani: నటుడు నాని ప్రస్తుతం నటుడుగా, నిర్మాతగా దూసుకుపోతున్నారు. వరుస విజయాలతో ఆయన మార్కెట్ పెరిగింది. నాని ఆస్తులు, రెమ్యునరేషన్ వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Nani: ప్రస్తుతం నాని నటుడుగా, నిర్మాతగా స్పీడుగా దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా సరిపోదా శనివారం సక్సెస్ తో తెలుగులో నెక్ట్స్ లెవిల్ కు వెళ్లారు. ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు నాని.
ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్ హౌసులో శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 3’ మూవి చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమా ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుండడం విశేషం.
పాన్ ఇండియా రేంజ్ లో నాని కెరియర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ నేపధ్యంలో అసలు నాని ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఆయన ఆస్దులు ఎంత విలువ ఉంటాయనేది చర్చగా మారింది.
అందరు హీరోల్లాగే ఒకానొక దశలో నానిని వరుస ఫ్లాపులు ఇబ్బంది పెట్టాయి. ఆ టైమ్ లో నాని పని అయ్యిపోయింది. ఇంక కెరీర్ పరంగా పుంజుకోవడం సులువు కాదని అన్నారు. అయితే నాని మాత్రం మామూలోడు కాదు. పడి లేచాడు.
తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యే విషయంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం నాని రెమ్యునరేషన్ 35 నుంచి 40 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.
అందుకు కారణం వరుస విజయాలతో నాని మార్కెట్ రేంజ్ పెరగటమే. ప్రస్తుతం 80 నుంచి 100 కోట్ల మధ్యలో ఆయనపై బిజినెస్ నడుస్తోంది. డిజిటల్ మార్కెట్ కూడా నాని సినిమాలకు బాగా క్రేజ్ పెరిగింది. ఆయన సినిమాలు మంచి ప్రీమియం ధరలకు ఓటీటీ ఛానల్స్ కొనుగోలు చేస్తున్నాయి. అందుకే నానితో సినిమాలు చేయడానికి చాలామంది నిర్మాతలు క్యూలు కడుతున్నారు.
ఈ నేపధ్యంలో నాని ఆస్దులు రెట్టింపు అయ్యాయని తెలుస్తోంది. ఆయన రియల్ ఎస్టేట్ మీద పెట్టిన మొత్తాలు కూడా రెండు మూడు రెట్లు పెరిగాయనని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం నానికి రూ. 150 కోట్లకు పైగా నికర విలువ ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అంతేకాదు, ఈ స్టార్ హీరోకు హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో రూ. 40 కోట్ల విలువ చేసే ఇళ్లు ఉన్నాయట.
అలాగే, దాదాపు రూ. 6 కోట్లు విలువైన కార్లు, రూ. 2 కోట్ల విలువైన యాక్ససిరీస్‌లు, రూ. 30 కోట్లు విలువైన ఫ్లాట్లు ఉన్నాయని తెలుస్తోంది. అందుకే ధైర్యంగా ఆయన సినిమాల్లో వంద కోట్లు అయినా పెట్టుబడి పెట్టడానికి వెనకాడటం లేదు.
భవిష్యత్‌లోనూ నాని సినీ హీరోగా, నిర్మాతగా మరెన్నో దూసుకుపోతాడనేది నిజం. మిడిల్ రేంజ్ హీరోలలో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడంతో పాటు ఆస్దులు సంపాదించటం, వరుస విజయాలు సాధించడం నానికి మాత్రమే సాధ్యమైందని చెప్పవచ్చు.