రజినీకాంత్ పక్కన చాలా సినిమాల్లో ఆడిపాడిన శ్రీదేవి.. మూండ్రు ముడిచు అనే తమిళ సినిమాలో తలైవా సవతి తల్లి పాత్రలో కనిపించింది. ఇందులో కూడా ఆయన హీరోయిన్ గా మారాల్సిన ఆమె.. అనుకోని కారణంగా హీరో పాత్రకు తల్లిగా ఎంట్రీ ఇస్తుంది. ఈ మలుపు సినిమాను సూపర్ హిట్ చేసింది. అయితే ఈసినిమాలో కమల్ హాసన్ కూడా నటించడం విశేషం. రజినీకాంత్ కు ఇలా తల్లిగా, ప్రియురాలిగా రెండు రకాల పాత్రలు చేసిన రికార్డ్ శ్రీదేవి సోంతం అయ్యింది.