The Ghost Review: ప్రీమియర్ టాక్... అదిరిపోయే ట్విస్ట్స్ దుమ్మురేపే యాక్షన్,  నాగ్ కి సాలిడ్ హిట్ ఖాయమా!

First Published Oct 5, 2022, 6:03 AM IST

కింగ్ నాగార్జున సోలోగా సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. సోగ్గాడే చిన్నినాయనా చిత్రం తర్వాత ఆ రేంజ్ హిట్ ఆయనకు పడలేదు. అయితే ది ఘోస్ట్ మూవీతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కావాలని చూస్తున్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించి యాక్షన్ ఎంటర్టైనర్ ది ఘోస్ట్ మూవీపై చాలా ఆశలే పెట్టుకున్నారు.

The Ghost Movie Review

పరిశ్రమలో ప్రయోగాలు చేయాలంటే నాగార్జున తర్వాతే. అలాగే ఆయన యువ దర్శకులను ప్రోత్సహిస్తూ ఉంటారు. కొత్తవాళ్లతో మంచి విజయాలు నమోదు చేసిన హిస్టరీ ఆయన సొంతం. ఇక గరుడ వేగ మూవీతో ఇండస్ట్రీని ఆకర్షించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు చాలా గ్యాప్ తర్వాత ది ఘోస్ట్ తెరకెక్కించారు. ఎమోషనల్ అంశాలు జోడించి పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ ది ఘోస్ట్ తెరకెక్కింది. 
 

The Ghost Movie Review

నాగార్జున కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో ది ఘోస్ట్ మూవీ నిర్మించారు. యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు కీలక సన్నివేశాలు విదేశాల్లో రిచ్ లొకేషన్స్ లో తెరకెక్కించారు. సబ్జెక్టుపై నమ్మకంతో నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా ఖర్చు చేశారు అనడంలో సందేహం లేదు. అక్టోబర్ 5న ది ఘోస్ట్ వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఇప్పటికే ప్రీమియర్స్ ప్రదర్శన ముగియగా టాక్ బయటికి వచ్చింది. ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకుల స్పందన ఏమిటో చూద్దాం.. 

The Ghost Movie Review

ఇంటర్ పోల్ అధికారి విక్రమ్ కథనే ది ఘోస్ట్ మూవీ. యాక్షన్, సెంటిమెంట్, రొమాన్స్ జోడించి అదిరిపోయే ట్విస్ట్స్ తో దర్శకుడు ప్రవీణ్ సత్తారు చిత్రాన్ని రూపొందించారు. ఏడారిలో ఓ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్ తో సినిమా మొదలవుతుంది. కథను ఫస్ట్ హాఫ్ లో కొంచెం నెమ్మదిగా నడిపించిన దర్శకుడు అదిరిపోయే ఇంటర్వెల్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇంటర్వెల్ బ్లాక్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అంటున్నారు. సిస్టర్ సెంటిమెంట్ తో కూడిన ఎమోషనల్ సన్నివేశాలు పర్లేదు.

The Ghost Movie Review


కథ అర్థవంతంగా మెల్లగా ఆసక్తి పెంచుతూ సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు స్క్రీన్ ప్లేని పరుగులు పెట్టించారు. చివరి వరకు అలరించే యాక్షన్ ఎపిసోడ్స్, మలుపులతో ది ఘోస్ట్ సాగుతుంది. ఫస్ట్ హాఫ్ కి మించి సెకండ్ హాఫ్ ఉందన్న మాట వినిపిస్తుండటం శుభపరిణామం. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ ది ఘోస్ట్ చిత్రానికి హైలెట్ అనేది ప్రీమియర్ టాక్ ద్వారా అందుతున్న సమాచారం. 

The Ghost Movie Review

 60 ఏళ్ల వయసులో కూడా నాగార్జున స్క్రీన్ పై వెరీ స్టైలిష్ అండ్ ఎనర్జిటిక్ గా ఉన్నారు. ఇంటర్ పోల్ ఆఫీసర్ గా ఆయన లుక్ సూపర్. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ఇరగదీశారు. హీరోయిన్ సోనాల్ గ్లామర్ తో పాటు నటనతో ఆకట్టుకుంది. కథ, స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్ ట్విస్ట్, యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ పాజిటివ్ అంశాలుగా ప్రేక్షకులు అభివర్ణిస్తున్నారు. 
 

The Ghost Movie Review

స్లోగా సాగే ఫస్ట్ హాఫ్, సాంగ్స్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు నిరాశపరిచాయనేది ప్రీమియర్స్ ద్వారా తెలుస్తుంది. మొత్తంగా మెజారిటీ ఆడియన్స్ ది ఘోస్ట్ మూవీ పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారు. దసరాకు నాగార్జున సోలోగా సాలిడ్ హిట్ ఖాతాలో వేసుకున్నాడన్న మాట వినిపిస్తోంది. నాగ ఫ్యాన్స్ తో పాటు యాక్షన్ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది.

The Ghost Movie Review


సునీల్ నారంగ్, పూసుకుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ది ఘోస్ట్ చిత్రాన్ని నిర్మించారు. మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా... భరత్-సౌరభ్ సాంగ్స్ కంపోజ్ చేశారు. ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్ గా వ్యవహరించారు. ముకేష్ జి సినిమాటోగ్రఫీ అందించారు. 

click me!