మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత `ఖైదీ నెంబర్ 150` హిట్‌తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రయోగాత్మకంగా చేసిన పీరియాడికల్ మూవీ `సైరా` ప్రశంసలకే పరిమితమైంది. ఇటీవల `ఆచార్య`తో వచ్చారు చిరు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. రామ్‌చరణ్ కీలక పాత్రలో నటించి ఆ సినిమా చిరు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్. ఈ సినిమా విషయంలో చిరు అనేక అనుమానాలు ఎదుర్కొన్నారు. వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారు చిరు. ఇప్పుడు `గాడ్ ఫాదర్`(God Father)తో వస్తున్నారు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన మోహన్‌లాల్ నటించిన `లూసీఫర్`ని రీమేక్‌గా `గాడ్ ఫాదర్` తెరకెక్కించారు. తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసిన రూపొందించారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయనతోపాటు లేడీ సూపర్‌స్టార్ నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన చిత్రమిది. ఎన్వీ ప్రసాద్, ఆర్‌బీ చౌదరి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5(నేడు బుధవారం) విడుదలవుతుంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ పడ్డాయి. మరి సినిమా ఎలా ఉందనేది నెటిజన్లు ట్విట్టర్ ద్వారా పోస్టులు పెడుతున్నారు. `గాడ్ ఫాదర్` ట్విట్టర్ టాక్(God Father Twitter Talk)ఎలా ఉందో చూద్దాం.
`గాడ్ ఫాదర్` కథ అందరికి తెలిసిందే. ఎందుకంటే `లూసీఫర్` చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేశారు. ఆల్మోస్ట్ రెగ్యూలర్ సినిమాలు చూసే ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని ఆల్‌రెడీ చూసే ఉంటారు. సీఎం చనిపోవడంతో ఆయన అల్లుడు సీఎం పీఠం ఎక్కాలని ప్లాన్ చేస్తుంటాడు. అయితే సీఎం కొడుకు అజ్ఞాతంలో ఉంటాడు. కానీ తెరవెనుక రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుంటాడు. మరి అల్లుడి కుట్రలను ఎలా భగ్నం చేశాడు, తను సీఎం అయ్యాడా లేదా? అనేది అసలు కథ. God Father Twitter Review.
సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. `బాస్ ఈజ్ బ్యాక్` అంటున్నారు. చిరంజీవికి సరిగ్గా సరిపోయిన స్టోరీ అని, ఆయన తన విశ్వరూపం చూపించారని చెబుతున్నారు సినిమా చూసిన ఆడియెన్స్. ప్యూర్ మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, చిరంజీవి స్వాగ్ నెక్ట్స్ లెవల్. సల్మాన్ తన పాత్రని బాగా చేశాడని అంటున్నారు.
అదే సమయంలో కొన్ని నెగటివ్ పోస్ట్ లున్నాయి. ఫస్టాఫ్ పర్వాలేదని, సెకండాఫ్ బాగా డౌన్ ఉందని, సినిమా అంతలేదని, సల్మాన్ ఖాన్ ఎపిపోడ్ చాలా నిరాశ పరిచిందని అంటున్నారు. ఆయన యాక్షన్ సీన్లు సీజీ వర్క్ చాలా దారుణంగా ఉన్నాయని చెబుతున్నారు. క్లైమాక్స్ నిరాశ పరిచేలా ఉందని చెబుతున్నారు. చిరంజీవి లుక్, ఎడిటెడ్ ఎక్స్ ప్రెషన్స్ బాగాలేవని, సల్మాన్ రోల్ బాగా నిరాశ పరుస్తుందని అంటున్నారు.
God Father Twitter Review.
ఫస్టాఫ్ చాలా గ్రిప్పింగ్‌గా ఉందని, ఎక్కడా అనవసరమైన సీన్లు లేవని చెబుతున్నారు. మెగాస్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకునే సన్నివేశాలు చాలా ఉన్నాయట. చిరంజీవి, సత్యదేవ్‌ల మధ్య నడిచే పొలిటికల్ డ్రామా ఆద్యంతం ఎంగేజింగ్‌గా సాగిందట. మాస్ యాక్షన్ సన్నివేశాలకు సంగీత దర్శకుడు థమన్ బీజీఎం మరో లెవల్‌కి తీసుకెళ్లిందట. ఇంటర్వెల్ సీన్లు అదిరిపోయాయని అంటున్నారు.
ఫస్టాఫ్‌లో 12 నిమిషాల పాటు ఉండే ఓ ఫైట్ సీన్ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని, థియేటర్లలో అది ఫైరింగ్ ఎలిమెంట్ అంటున్నారు. క్లైమాక్స్ మాస్ ఎలివేషన్ అదిరిపోయేలా ఉందని టాక్. పవన్ కళ్యాణ్‌కి `గబ్బర్ సింగ్` ఎలాగో, చిరంజీవికి `గాడ్ ఫాదర్` అలాంటి చిత్రమవుతుందట. చిరు ఎంట్రీ సీన్ బాగుందని, సత్యదేవ్, నయనతార ఓకే అనిపించారని, ప్రీ ఇంటర్వెల్ మాస్ ఫైర్ ని, ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ అట.
ఓవరాల్‌గా యావరేజ్ రివ్యూస్ వస్తున్నాయి. ఫ్యాన్స్ ఆహా.. ఓహో అన్నట్టు ఉన్నా, సాధారణ ఆడియెన్స్ కి మాత్రం యావరేజ్‌గానే అనిపిస్తుందట. కొంత పాజిటివ్‌తోపాటు మరికొంత నెగటివ్ అంశాలున్నాయని దీంతో సినిమా యావరేజ్ ఫలితాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. చిరంజీవికి మాత్రం మంచి కమ్ బ్యాక్ అంటున్నారు. అయితే ఓవర్సీస్‌లో ఎక్కువగా అభిమానులే చూస్తారు. కాబట్టి పూర్తి స్థాయి తెలుగు రివ్యూ చూసేంత వరకు ఫలితాన్ని జడ్జ్ చేయలేం. అసలైన `ఏషియానెట్` రివ్యూ కోసం వేచి ఉండండి.