Illu Illalu Pillalu Today Episode: మళ్లీ రామరాజుని వెర్రోడిని చేసిన కుటుంబం, అత్తారింటికి చేరిన వల్లి

Published : Jul 08, 2026, 09:21 AM IST

Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వేదవతి వల్లిని ఇంటికి తీసుకెళ్దామని అంటుంది. దానికి చందు ఒప్పుకోడు. కానీ మధ్యలో రామరాజు వచ్చి అక్కడ సీన్ మొత్తం మార్చేస్తాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

PREV
13
వల్లిని ఒప్పుకోని చందు

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వల్లి ఆత్మహత్యాయత్నం చేయడంతో వేదవతి చందుతో వల్లిని ఇంటికి తీసుకువెళ్దాం అని చెబుతుంది. దానికి చందు ఏమాత్రం ఒప్పుకోడు. దానికి నర్మద మాట్లాడుతూ వల్లితో పెళ్లి చేసింది మామయ్యగారే, కాబట్టి మావయ్య గారు ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దామని చెబుతుంది. ‘వాళ్ల కుటుంబం ఎంతో మంచిదని వల్లి ఉత్తమ కోడలని నాన్న అనుకుంటున్నారు. వీళ్ళు చేసిన మోసాలు గురించి తెలిస్తే నాన్న కోపంతో వీళ్ళని ఏదో ఒకటి చేస్తారు’ అంటాడు ధీరజ్. వేదవతి మాట్లాడుతూ ‘నమ్మించి మోసం చేశారనే బాధను కూడా మీ నాన్న తట్టుకోలేరు’ అని చెబుతుంది. మధ్యలో ప్రేమ మాట్లాడుతూ వల్లీ చేసిన విషయం మోసాలు తెలిస్తే మామయ్య వీళ్లని జన్మలో క్షమించరు, వాళ్ళని ఇంటికి రానివ్వరు అని అంటుంది. ‘చావు చివరిదాకా వెళ్లొచ్చింది కాబట్టి ఇకపైన ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటుందని అనుకుంటున్నాను. అందుకే క్షమించేసి ఒక అవకాశం ఇద్దాం. పొరపాటున అదేమైనా చేసుకుంటే దానికి కారణం మనమవుతాము. అంత పెద్ద పాపం మనకొద్దు’ చందుకి నచ్చచెప్పుతుంది వేదవతి. కానీ చందు వినకుండా అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

23
రామరాజు మళ్లీ వెర్రోడిని చేశారు

ఈలోపు అక్కడికి రామరాజు వస్తాడు. ‘ఏమైంది? అంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావని’ అడుగుతాడు. సుకన్య వల్లి బావిలోకి దూకేసింది అని చెబుతుంది. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈలోపు భాగ్యం వేదవతి వైపు చూస్తూ నమస్కారం పెట్టి ఏదీ చెప్పద్దు అని ప్రాధేయపడుతుంది. ఆ తర్వాత భాగ్యం మాట్లాడుతూ ‘అబార్షన్ అయిందని మా అమ్మాయి ప్రాణాలు తీసుకోబోయింది’ అని చెబుతుంది. దాంతో రామరాజు వల్లిని ఊరుకోబెడతాడు. ‘నీకేమన్నా అయితే నా కొడుకు ఏమైపోతాడు. మేము ఇది తట్టుకొని బతకగలమా’ అని అంటాడు. వల్లిని తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు రామరాజు. తర్వాత వేదవతి.. భాగ్యం, ఆనందరావు చూస్తూ ఇంకొకసారి మీరు మా ఇంటి గడప తొక్కితే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతారు.

ఇక్కడ నుంచి సీన్ చందు దగ్గరికి మారుతుంది. చందు చాలా బాధపడుతూ ఉంటాడు. వేదవతి చందుని చాలా బతిమిలాడుతుంది. అన్యాయంగా వదిలేస్తే చనిపోతుందని అలా చేయొద్దని చెబుతుంది.. కానీ చందు వల్లి చేసిన మోసాలన్నీ రామరాజుకు చెబుతానని అంటాడు. ఇంత పెద్ద విషయాన్ని దాచి.. నాన్నను నేను మోసం చేయలేను కాబట్టి అంతా చెప్పేస్తాను అని అంటాడు. కానీ వేదవతితో పాటూ అందరూ ఆయనను ఆపుతారు. అలా చెబితే నాన్న ప్రాణం మీదకు వస్తుందని అందుకే చెపొద్దని చందుతో పాటూ మిగతా వారిచేత ఒట్టేయించుకుంటుంది.

33
వల్లి మాయలో రామరాజు

ఇక వల్లి రామరాజుకు కాఫీ పట్టుకొని వస్తుంది. రామరాజు కోపంగా వేదవతిని పిలుస్తాడు. కోడలు ఆరోగ్య పరిస్థితి బాలేనప్పుడు పనులు ఎందుకు చేయిస్తున్నారని గట్టిగా అడుగుతాడు. దీంతో వేదవతి వల్లిని బాగా తిడుతుంది. కానీ రామరాజు అడ్డుకొని వల్లి బంగారమని మెచ్చుకుంటాడు. అదంతా చూసి మిగతా వాళ్ళకి కోపం వస్తుంది. వల్లి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అదే సమయానికి అమూల్య, సాగర్ ఇంటికి వస్తారు. అమూల్యతో రామరాజు మాట్లాడుతూ ‘రేపు కోర్టు హియరింగ్ ఉంది. నువ్వు భయపడకుండా రేపు మాట్లాడు. మేము అందరం కూడా మీ పక్కనే ఉంటాము’ అని చెబుతాడు. వల్లి ప్రాణాలు తీసుకోబోయిందనే విషయం అమూల్యకు చెప్పకండి అని రామరాజు అందరికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

నర్మద ఇంట్లో వంట చేస్తూ ఉంటే వేదవతి అక్కడికి వస్తుంది. నర్మదా తనతో మాట్లాడుతుందో లేదో అని వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంది. నర్మద మాత్రం కోపంగా నటిస్తుంది. వేదవాతి మాట్లాడుతూ ‘వల్లికి నిజంగానే నీవల్ల ప్రెగ్నెన్సీ పోయిందని.. కోపంతో నిన్ను కొట్టేసాను. దాని ప్రెగ్నెన్సీ నాటకమని నాకు తెలియదు కదా.. లేకపోతే నా కోడలిని కొడతానా చెప్పు. నిన్ను కొట్టినందుకు తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను’ అంటుంది. దాంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories