Lenin Review: అఖిల్ అక్కినేని హిట్ కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన `లెనిన్` మూవీతో వస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ టాక్ బయటకు వచ్చింది.
అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు `అఖిల్`. తన పేరుతోనే తొలి సినిమా చేసి ఆకట్టుకున్నాడు. యాక్షన్, కమర్షియల్ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ అఖిల్‌ని హీరోగా నిలబెట్టలేకపోయాయి. చివరగా చేసిన `ఏజెంట్` కూడా దారుణంగా డిజప్పాయింట్ చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు `లెనిన్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు.
`లెనిన్` మూవీలో మొదట హీరోయిన్‌గా శ్రీలీలని అనుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో ఆమె బయటకు వచ్చింది. ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా వచ్చింది. కొంత షూటింగ్ డిలే కూడా అయ్యింది. ఫైనల్‌గా ఈ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 10న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను పెంచాయి. అఖిల్ కి హిట్ పడే అవకాశం ఉందనే సాంకేతాలను ట్రైలర్ ఇచ్చింది. దీనికితోడు నాగార్జున, నాగవంశీ, అఖిల్ కూడా తమ కాన్ఫిడెంట్‌ని వెల్లడించారు. దీనికితోడు ఈ మూవీకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.
34
లెనిన్ మూవీ ఫస్ట్ టాక్
`లెనిన్` మూవీ బాగా వచ్చిందని, ఈ సారి వస్తున్నాం, కొడుతున్నామని నాగార్జున తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే మూవీకి పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో మూవీ స్టార్ట్ అవుతుందట. లెనిన్ ఉన్న ఊరు గురించి, లెనిన్ గురించి ఎన్టీఆర్ తన వాయిస్‌తో ఇంట్రో ఇస్తారట. ఆ తర్వాత అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని తెలుస్తోంది. భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీ సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్‌తో ఉండటం ఇందులో ఆకట్టుకునే అంశమని అంటున్నారు. సినిమా శ్రీరామపురంలో సాగుతుంది. అక్కడ జాతర చుట్టూ సాగే కథ ఇదని అంటున్నారు, అక్కడ ఊరు పెద్ద ఒకరు ఉంటాడు, ఆయన చేసే మిస్టేక్స్ ని ఎదురించే క్రమంలో ఊరి పెద్దకు, హీరోకు మధ్య గొడవలు జరుగుతాయి. అయితే గొడవలు ఊర్లో కామన్ ఈ సారి కొన్ని కట్టుబాట్లు ఉన్నా కూడా వాటిని బ్రేక్ చేసి తలలు లేవాల్సిందే అనే పట్టుదలకు పోవడం వల్లే ఈ మూవీలో అసలు గొడవలకు కారణమని అంటున్నారు. ఈ క్రమంలో వచ్చే డ్రామా, యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయని చెబుతున్నారు.
అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య లవ్ ట్రాక్ హైలైట్‌గా నిలుస్తుందట. ఊర్లో గొడవలకు వీరి లవ్ ట్రాక్ ఒక కారణమని టాక్. మరి ప్రేమ కోసం హీరో ఎలా పోరాడాడు అనేది చిత్ర కథ అని సమాచారం. అయితే సినిమాలో క్లైమాక్స్ లో హీరో హీరోయిన్‌కి సంబంధించిన ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంటుందట. అదే మూవీకి హైలైట్‌గా నిలుస్తుందని, దాన్ని నమ్మే నాగ్, నాగ్ అశ్విన్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారని సమాచారం. ఫస్టాఫ్‌లో రెగ్యూలర్ స్టయిల్‌లో ఉన్నా, సెకండాఫ్‌లో ఇంటెన్సిటితో, సీరియస్‌గా, ఎమోషనల్‌గా సాగుతుందని, నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఉత్కంఠకు గురి చేస్తుందని అంటున్నారు. నాగార్జున కూడా ఇదే చెప్పారు. సెకండాఫ్ మీకు బోర్ తెప్పించదు అని. ఉప్పెన, పెద్ది తరహా ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుందని టాక్. మరి అది ఎంత వరకు సాధ్యమనేది చూడాలి. కానీ ఇందులో నిజమెంతా? అనేది చూడాలి. అసలైన ఏసియా నెట్ తెలుగు రివ్యూ కోసం వేచి ఉండండి.