బైసన్
మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ విక్రమ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బైసన్ కాలామాదన్ నిజజీవిత కబడ్డీ క్రీడాకారుడు మనతి గణేశన్ కథ ఆధారంగా రూపొందింది. థియేటర్లలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం నవంబర్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది.
ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్
రిలీజ్ డేట్ : నవంబర్ 20
ఎ మాన్ ఆన్ ది ఇన్‌సైడ్ సీజన్ 2
టెడ్ డాన్సన్ నటించిన ఈ క్రైమ్ కామెడీ సీజన్ 2 లో చార్లెస్ అనే పాత్ర కాలేజ్ క్యాంపస్ లో అండర్ కవర్ గా చేరి వివిధ రహస్యాలను బయటపెడతాడు. నవంబర్ 20 నుండి అందుబాటులోకి వస్తుంది.
ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్
రిలీజ్ డేట్ : నవంబర్ 20
షాంపైన్ ప్రాబ్లమ్స్
మింకా కెల్లీ టామ్ వోజ్నిక్‌జ్కా, థిబాల్ట్ డీ మోంటాలెంబర్ట్ నటించిన ఈ రొమాంటిక్ కామెడీ నవంబర్ 19 నుండి నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం అవుతుంది.
ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్
రిలీజ్ డేట్ : నవంబర్ 19
వన్ షాట్ విత్ ఎడ్ షీరన్ ఎ మ్యూజిక్ ఎక్స్పీరియెన్స్
ఎడ్ షీరన్ న్యూయార్క్ నగరంలో ఒక గంటపాటు ఒక నిరంతర లాంగ్ షాట్ లో హిట్ పాటలను పాడుతూ కనిపించే ఈ ప్రత్యేక సంగీత అనుభవం నవంబర్ 21 న విడుదల కానుంది.
ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్
రిలీజ్ డేట్ : నవంబర్ 21
బ్యాక్ టు బ్లాక్
ఇంగ్లీష్ గాయని, గీత రచయిత ఏమీ వైన్‌హౌస్ జీవితంపై రూపొందిన ఈ బయోగ్రాఫికల్ డ్రామా నవంబర్ 17 నుండి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మారిసా అబెలా ప్రధాన పాత్ర పోషించింది.
ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్
రిలీజ్ డేట్ : నవంబర్ 17