చిరంజీవి, శ్రీదేవి మధ్య గొడవల వల్ల ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా? ఇద్దరి మధ్య ఏం జరిగింది?

Published : Nov 16, 2025, 10:54 PM IST

Chiranjeevi , Sridevi clash : మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి కాంబోకు ఎంత క్రేజ్ ఉండేదో అందరికి తెలిసిందే. స్క్రీన్ పై హిట్ పెయిర్ గా ఉన్న ఈ స్టార్ సెలబ్రిటీల మధ్య గోడవ జరిగి.. ఓ సినిమా ఆగిపోయిందని మీకు తెలుసా?

PREV
15
చిరంజీవి - శ్రీదేవి సినిమాల క్రేజ్

టాలీవుడ్‌లో ఒకప్పుడు చిరంజీవి–శ్రీదేవి కాంబినేషన్‌కు చాలా క్రేజ్ ఉండేది.. ఈ ఇద్దరు కలిసి చేసిన సినిమాలు తక్కువే అయినా, వాటి ప్రభావం ఇండస్ట్రీపై ఎక్కువగా పడింది. మరీ ముఖ్యంగా.. వీరిద్దరిక కాంబినేషన్ లో వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో.. ఆసినిమాను, వీరిద్దరి కాంబినేషన్ ను సినిమా ప్రేమికులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఈసినిమా టీవీలో వస్తే.. ఈరోజుకీ.. కదలకుండా చూస్తారు ఆడియన్స్. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా చూపించిన ఇంపాక్ట్ అలాంటిది. అయితే ఈ సూపర్ హిట్ జోడీ మధ్య ఒక సందర్భంలో మనస్పర్థలు రావడంతో ఓ సినిమా పూర్తిగా ఆగిపోయింది.

25
నిర్మాతగా మారిన శ్రీదేవి..

చిరంజీవి, శ్రీదేవి కలిసి కొన్ని సినిమాలు చేశారు. ఆతరువాత శ్రీదేవి బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. చేతి నిండా సంపాదించింది. ఈక్రమంలో ఆమెకు నిర్మాతగా మారాలని కోరిక పుట్టింది. దాంతో వెంటనే..తనకు చాలా ఇష్టమైన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని సెలక్ట్ చేసుకుని. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నం చేసింది. ఆ సినిమా పేరు ‘వజ్రాల దొంగ’. ఈ చిత్రాన్ని శ్రీదేవి స్వయంగా నిర్మించాలని నిర్ణయించుకున్నారు. స్టార్ హీరోయిన్‌గా ఉన్నత స్థాయిలో ఉన్న సమయంలో, ఆమె నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు సమాచారం. టైటిల్ ప్రకటించడమే కాకుండా, ఓ పాట షూటింగ్ కూడా పూర్తయ్యింది.

35
చిరంజీవి , శ్రీదేవి మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు..?

అయితే వజ్రాలదొంగ సినిమా షూటింగ్ టైమ్ లోనే చిరంజీవి , శ్రీదేవి మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చాయట. నిర్మాత కావడంతో.. శ్రీదేవి ఈ సినిమా కథను, పాత్రలను ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది. హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె భావించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో హీరోగా ఉన్న చిరంజీవి తన పాత్రకు తగ్గట్టుగా ప్రాముఖ్యత లేకపోతే తాను ఈసినిమా చేయనని చెప్పేశారట. కథలో హీరో పాత్ర ఇంపార్టెన్స్ తగ్గకూడదని దర్శకుడికి ఆయన స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.

45
ఆగిపోయిన వజ్రాలదొంగ సినిమా

ఈ అంశంలో ఇద్దరు మొండిపట్టుదల పట్టుకుని కూర్చోవడంతో.. పరిస్థితి మారిపోయింది. ప్రత్యక్షంగా గొడవలు, తిట్టుకోవడం వంటివి ఏమీ జరగకపోయినా, సినిమా కంటెంట్ విషయంలో వచ్చిన అసమ్మతి పెరిగిపోయింది. ఈ విషయంలో ఎవరు తగ్గకపోవడంతో.. చివరికి సినిమా నిలిచిపోయింది. అప్పటికే ఒక పాట షూట్ చేసినా, ‘వజ్రాల దొంగ’ సినిమా.. ఆతరువాత అసలు సెట్స్ మీదకు వెళ్లలేదు. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయింది.

55
నిర్మాతగా వెనకడుకు వేసిన శ్రీదేవి.

ఆ సంఘటన తర్వాత శ్రీదేవి మళ్లీ నిర్మాతగా సినిమాలు చేయలేదు. సినిమా నిర్మాణం అంటే అంత సులువైన పని కాదని ఆమెకు అర్ధం అయినట్టు ఉంది. ఆతరువాత కాలంలో ఆమె హీరోయిన్ గానే కొనసాగింది. అయితే బాలీవుడ్ కే పరిమితం అయ్యింది శ్రీదేవి. ఈ విషయాలన్నింటినీ ఓ సీనియర్ సినీ జర్నలిస్టు ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు సమాచారం. ఇక హీరోయిన్ గా సినిమాలు తగ్గిన తరువాత తన ఫ్యామిలీకి ఎక్కువగా టైమ్ కేటాయించిన శ్రీదేవి.. మామ్ సినిమాతో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆతరువాత ఆమె దుబాయ్ లో ఫ్యామిలీ ఫంక్షన్ కు వెళ్లిన ఆమె.. అనుమానస్పద పరిస్థితుల్లో మరణించింది.

Read more Photos on
click me!

Recommended Stories