కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి, బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేస్తాయి.. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రను వేస్తాయి. ఒకే ఒక్క ఎమోషనల్ సీన్ వల్ల ఓ సినిమా ఏడాదిపాట థియేటర్లలో నడిచిందని మీకు తెలుసా?
కొన్ని సినిమాలు స్క్రీన్ పై చరిత్ర సృష్టిస్తే.. మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసు పొరల్లో నిలిచిపోతుంటాయి. ఆడియన్స్ పై ప్రభావం చూపించడానికి స్టార్ హీరోలు అవసరం లేదు, భారీ బడ్జెట్లు కూడా అవసరం లేదు. మంచి కథ, ఎమోషన్, గుండెను పిండేసే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఉంటే చాలు ఆ సినిమాను ఆడియన్స్ అంత తేలిగ్గా మార్చిపోలేరు. అటువంటి సినిమాలలో సీతారామయ్య గారి మనవరాలు మూవీ కూడా ఒకటి. ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాను అద్భుతమైన స్క్రీన్ ప్లైతో.. బ్లాక్ బస్టర్ సినిమాగా తీర్చిదిద్దారు దర్శకుడు క్రాంతి కుమార్. ఈమూవీలో ప్రతీ సన్నివేశం ఒక ఆణిముత్యం అని చెప్పాలి.
25
స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ కూడా లేదు..
ఫ్యామిలీ ఎమోషన్స్ లో బేస్ చేసుకుని తీసిన ఈమూవీ సోల్ ను.. మానస రాసిన నవ్వినా కన్నీళ్లే అనే నవల నుంచి తీసుకున్నారు. ఆ నవలకు ప్రాణం పోసి.. నిజంగా మన కళ్లెదురుగానే ఈ కథ నడుస్తుందేమో అన్నంత అద్భుతంగా సినిమాను తీర్చి దిద్దాడు దర్శకుడు. అక్కినేని నాగేశ్వరరావు, మీనాల నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. అంతే కాదు ఏఎన్నార్ మొదటి సారి విగ్ లేకుండా నటించిన మూవీ ఇది. బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మీనా.. సోలో హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా కూడా ఇదే.
35
ప్రతీ సన్నివేశం ఒక ఆణిముత్యమే..
తండ్రి మాటకాదని ప్రేమ పెళ్లి చేసుకున్న కొడుకు... విదేశాలకు వెళ్లాడు.. 20 ఏళ్లుగా కొడుకు వస్తాడన్న ఆశతో ఉన్న వారికి మనవరాలి రూపంలో ప్రేమ దొరుకుతుంది. కానీ కొడుకు,కోడలు మరణం గురించి వారికి తెలియదు. కొడుకు ఎప్పుడు వస్తాడని ముసలి ప్రాణాలు ఆమెను ఆశగా అడుగుతుంటే.. తల్లీ తండ్రులు చనిపోయారనే విషయం చెప్పలేక, దాచలేక, మీనా పడిన నరకయాతన అంతా ఇంతా కాదు. ఈ పాత్రలో ఆ ఎమోషన్స్ ను ఏఎన్నార్ కు పోటీగా పండించింది మీనా. తాత, నానమ్మలకు విషయం చెప్పలేక గోదారి తీరాన మీనా ఏడ్చిన సన్నివేశం మనసును కలచివేస్తుంది.
1991 లో రిలీజ్ అయిన సీతారామయ్యగారి మనవరాలు సినిమా కొన్ని థియేటర్స్ లో ఏడాది పాటు ఆడింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరావు, మీనా మధ్య ఎమోషనల్ సీన్స్ కు థియేటర్లలోనే ఆడియన్స్ కన్నీళ్లు పెట్టారు. కొడుకు పంపిన బహుమతి చూసుకుని తండ్రి కళ్లలో ఆనందం, అమెరికా వెల్లిపొమ్మని తాత తిట్టినప్పుడు మీనాపడే బాధ, నిజం తెలుసుకున్న సీతారామయ్య ఎయిర్ పోర్ట్ లో కొడుకు అస్థికలు చూసినప్పుడు ఏఎన్నార్ ఎక్స్ ప్రెషన్స్, అందుకు తగ్గట్టుగా మీనా ఎమోషనల్ డైలాగ్స్, ప్రతీ ఒక్కరి మనసును కలిచి వేస్తుంది. మనసులో ఇంత బాధను ఎలా మోశావమ్మా అని ఏఎన్నార్ చెప్పగానే.. మీనా మనసులో భారం ఒక్క సారిగా దిగిపోతుంది. ఆమె తాతను హత్తుకుని ఇన్నాళ్ల బరువును కన్నీళ్ల రూపంలో బయటకు తీస్తుంది. ఈ క్లైమాక్స్ సీన్ ను సినీ ప్రేమికులు ఎప్పటికీ మర్చిపోలేరు.
55
మీనాతో ఏఎన్నార్ ఏమన్నాడంటే..?
రిలీజ్ అయ్యి 35 ఏళ్ళు అవుతున్నా.. సీతారామయ్యగారి మనవరాలు సినిమాను ప్రేక్షకులు మర్చిపోలేదు. అప్పట్లో సూపర్ హిట్ అయిన ఈసినిమా 4 నంది అవార్డులను తెచ్చిపెట్టింది. అంతే కాదు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ఈసినిమాను ప్రదర్శించారు. ఇక ఈమూవీని మలయాళం, కన్నడ భాషల్లో రీమేక్ చేశారు. మీనా నటన చూసిన ఏఎన్నార్.. '' షూటింగ్ లో పెద్దగా అనిపించలేదు కానీ.. సినిమా చూసిన తరువాత నీ నటన అద్భుతంగా అనిపించింది, బాగా చేశావు'' అని మెచ్చుకున్నారట. ఈ విషయాన్ని మీనా ఓ ఇంటర్వ్యలో వెల్లడించారు.