ఐదేళ్లకు ఫలితం.. యాదాద్రి టెంపుల్ లో విజయ్ దేవరకొండ.. ఫ్యామిలీ, ‘ఖుషి’ టీమ్ తో ప్రత్యేక దర్శనం

First Published | Sep 3, 2023, 2:21 PM IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)   తన కుటుంబం, ‘ఖుషి’ టీమ్ తో కలిసి తాజాగా యాదాద్రి పుణ్య క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. 
 

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండకు ఐదేళ్ల తర్వాత డీసెంట్ హిట్ పడింది. 2018లో వచ్చిన ‘గీతా గోవిందం’తో హిట్ అందుకున్న విజయ్ వరుసగా ఐదు చిత్రాలతో ఫ్లాప్స్  అందుకున్నారు. గతేడాది భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లైగర్’ కూడా నిరాశ పరిచింది. 
 

వరుస డిజాస్టర్స్ ను అందుకుంటూ వస్తున్న ‘ఖుషి’తో మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారు. ఎలాగైన హిట్ హిట్ కొట్టాలని ప్రయత్నించారు. ఈసారి ప్రమోషన్స్ లోనూ చాలా పరిమిధుల మేరకే ఉన్నారు. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించలేదు. కానీ చిత్రంలోని సాంగ్స్,, మ్యూజిక్ కాన్సెర్ట్ సినిమాపై భారీ హైప్ పెంచింది. 
 


సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తొలిరోజే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు రాబడుతోంది. దీంతో ‘ఖుషి’ సక్సెస్ ను విజయ్ సెలబ్రేట్ చేసుకున్నారు. 

తాజాగా ఫ్యామిలీ, ‘ఖుషి’ టీమ్ తో కలిసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి టెంపుల్ ను సందర్శించారు. ఆలయంలో దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దైవ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది విజయ్ దర్శనం చేసుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. 
 

అలాగే గజమాలతో విజయ్ ను సన్మానించారు. పూజారులు ప్రత్యేక పూజ తర్వాత స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఇకవిజయ్ పట్టువస్త్రాల్లో ఆలయంలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ కార్యక్రమంలో విజయ్ మదర్ ఉన్నారు. అలాగే నిర్మాత నవీన్ యేర్నేని, టీమ్ ఉంది.
 

ఇక ‘ఖుషి’ చిత్రం రెండ్రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.51 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వసూళ్ల తీరు చూస్తుంటే ఫస్ట్ వీక్ తోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసేలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత (Samantha) విజయ్ సరసన నటించింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్  బ్యానర్ పై రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందించారు. 

Latest Videos

click me!