చీరకట్టులో ‘జైలర్’ నటి గ్లామర్ మెరుపులు.. నెట్టింట మిర్నా మీనన్ రచ్చ వేరేలా ఉందిగా..!

First Published | Sep 3, 2023, 1:30 PM IST

‘జైలర్’ కోడలుగా మెప్పించిన నటి మిర్నా మీనన్ సోషల్  మీడియాలో బ్యూటీఫుల్ లుక్ లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. గ్లామర్ మెరుపులతోనూ మైమరిపిస్తోంది. లేటెస్ట్ పిక్స్ తో చూపుతిప్పుకోకుండా చేసింది.
 

వెండితెరపైనే పద్ధతిగా మెరుస్తున్న మలయాళీ ముద్దుగుమ్మ  మిర్నా మీనన్ (Mirna Menon)  సోషల్ మీడియాలో మాత్రం అందాల విందుతో అదరగొడుతోంది. ‘జైలర్’ చిత్రంలో రజినీకాంత్ కోడలి పాత్ర పోషించిన మిర్నా పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 

దీంతో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే నెట్టింట ఫేమ్ దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో బ్యూటీఫుల్ లుక్ లో ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ మతులు పోగొడుతోంది. తాజాగా మరిన్ని ఫొటోలను షేర్ చేసింది.


లేటెస్ట్ ఫొటోస్ లో మిర్నా మీనన్ చీరకట్టులో మెరిసింది. వయోలైట్ శారీలో దర్శనమిచ్చి మంత్రముగ్ధులను చేసింది. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది. చీరలో చాలా బాగుందంటూ అభిమానులతో పాటు నెటిజన్లు ఈ ముద్దుగుమ్మను పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. 

ఇదిలా ఉంటే.. మిర్నా వెండితెరపై చాలా పద్ధతిగా మెరిసి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ విధానమే వేరేలా ఉంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. 
 

లేటెస్ట్ పిక్స్ లోనూ మిర్నా పద్ధతిగా చీరకట్టినా స్లీవ్ లెస్ బ్లౌజ్ లో షోల్డర్ అందాలను ప్రదర్శిస్తూ మంత్రముగ్ధులను చేసింది. నడుముపై చేతులేసి ఫొటోలకు ఫోజులిచ్చింది. మత్తెక్కించే చూపులతో మతులు చెడగొట్టింది. దీంతో ఈ బ్యూటీ అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్ తో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు.
 

ఇక మిర్నా మీనన్ ఇప్పటికే తెలుగులో రెండు సినిమాలు చేయడం విశేషం. ఆది సాయి కుమార్ సరసన ‘క్రేజీ ఫెలోస్’,  అల్లరి నరేశ్ సరసన ’ఉగ్రం’లో  ఫీమేల్ లీడ్ రోల్స్ లో చేసింది. ఇక ‘జైలర్’తో భారీ క్రేజ్ సంపాదించుకుంది. దీంతో తెలుగులో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందనేది చూడాలి.
 

Latest Videos

click me!