రిజిస్ట్రేషన్ కే కోటి ఖర్చైన బాలయ్య కొత్త ఇంటి ధర, విశేషాలు తెలిస్తే షాకే!

First Published Feb 26, 2021, 3:15 PM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ ఖరీదైన భవనాన్ని కొనడం హాట్ టాపిక్ గా మారింది. కోట్ల రూపాయలు వెచ్చించి కొనడంతో బాలయ్య కొత్తగా కోన్ ఇంటి విశేషాలు తెలుసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

ఇక బాలయ్య కొన్న భవంతి వివరాలు ఇలా ఉన్నాయి...  జూబ్లీ హిల్స్ లోని రోడ్ నంబర్ వన్ లో ఈ భవంతి ఉన్నట్లు సమాచారం. 9,935 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇల్లు ఉంది. విశాలవంతమైన గదులు, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ ఏరియా వంటి సౌకర్యాలు ఉన్నాయట.  గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మరో రెండు ఫ్లోలు కలిగిన భవంతి అని సమాచారం.
undefined
ఈ భవంతి ధర తెలిస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే.  ఈ విలాసవంతమైన ఇంటిని బాలయ్య రూ. 15కోట్లు వెచ్చించి కొన్నారట. విశాలవంతమైన భవనం కావడంతో పాటు, జూబ్లీ హిల్స్ వంటి ఖరీదైన ప్రాంతం కావడంతో ఇంత ధర పెట్టి కొన్నారట .
undefined
ఇప్పటికే బాలయ్యకు జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ వన్ లో ఓ లగ్జరీ హౌస్ ఉంది. కొత్తగా కొన్న ఇంటి రిజిస్ట్రేషన్ ఖర్చులకు ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
undefined
ఈ ఇంటికి స్టాంప్ డ్యూటీస్ రూ. 82.5 లక్షలు,  రిజిస్ట్రేషన్ చార్జెస్ రూ. 7.5  లక్షలు అయ్యాయట. కొనుగోలుతో పాటు దాదాపు రూ. 16కోట్లు బాలయ్య కొత్త కోసం వెచ్చించారు.
undefined
ఇక నడింపల్లి సత్య శ్రావణి అనే మహిళ నుండి ఈ ప్రాపర్టీ బాలయ్య కొనుగోలు చేశారట. దీనికి సంబందించిన లావాదేవీలు ఫిబ్రవరి 11న పూర్తి అయ్యాయట.
undefined
మరోవైపు బాలయ్య దర్శకుడు బోయపాటి శ్రీను షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మే నెలలో సమ్మర్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. గాడ్ ఫాదర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

Anjali

అలాగే క్రాక్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో తన నెక్స్ట్ మూవీ ప్రకటించారు బాలయ్య.

Anjali

click me!