సౌందర్యతో నాకు పెళ్లి జరగాల్సింది... ఆ మూవీ సమయంలో పెద్ద గొడవ జరగడంతో!

First Published | Feb 26, 2021, 2:12 PM IST

విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న జేడీ చక్రవర్తి, దివంగత సౌందర్య గురించి కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. సౌందర్యతో తనకు పెళ్లి జరగాల్సిందంటూ, మరుగున పడిన ఓ విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 
 

చక్రవర్తి నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఎమ్ ఎమ్ ఓ ఎఫ్.  నేడు ఈ మూవీ విడుదల కావడం జరిగింది. ఈ నేపథ్యంలో చక్రవర్తి ఈ మూవీ ప్రొమోషన్స్ లో పాల్గొనడం జరిగింది.
మాటల మధ్యలో సౌందర్య ప్రస్తావన రాగా, ఆమెతో తనకు గల రిలేషన్ గురించి చెప్పే క్రమంలో గతంలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేశారు చక్రవర్తి.

ప్రేమకు వేళాయరా మూవీలో చక్రవర్తి, సౌందర్య జంటగా నటించారు. దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ భారీ విజయం సాధించింది.
ఈ మూవీ చిత్రీకరణ సమయంలో తన మిత్రులైన ఎస్ వి కృష్ణారెడ్డి, కెమెరామెన్ శరత్ మరియు లిరిసిస్ట్ చంద్రబోస్ వైఫ్ సుచిత్ర.. చక్రవర్తికి పెళ్లి చేయాలనుకున్నారట.
అది కూడా చక్రవర్తి సౌందర్యను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశారట.  అయితే ఆ ప్రపోజల్ చక్రవర్తి తిరస్కరించారట. పెళ్లి వలన మా ప్రొఫెషనల్ రిలేషన్ దెబ్బతింటుంది, సౌందర్యను చేసుకోనని చక్రవర్తి ఖరాఖండిగా చెప్పేశారట.
అప్పుడు తాను ఒప్పుకుంటే సౌందర్యతో తనకు పెళ్లి జరిగి ఉండేదని అన్నారు ఆయన.  అలాగే ప్రేమకు వేళాయరా మూవీ చిత్రీకరణ సమయంలో సౌందర్యతో తనకు విభేదాలు తలెత్తాయని, దాని వలన చాలా కాలం మాట్లాడుకోలేదని చక్రవర్తి అన్నారు.
అయితే తరువాత మరలా కలిశాం అని, అప్పటి నుండి మరింత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యామని అన్నారు చక్రవర్తి.
సౌందర్యకు డైరెక్షన్ చేయాలనే కోరిక ఉండేది. ఆమె నాకు ఓ అద్భుతమైన కథ చెప్పారు. దానిని తెరకెక్కించాలని సౌందర్య అనుకున్నారు. తన కోరిక తీరకుండానే అకాల మరణం పొందారని చక్రవర్తి తెలియజేశారు.
ఇక పెళ్లి గురించి అడుగగా... పెళ్లి కాని వాడ్ని అందరూ పాపం అంటారు... కానీ నా ఉద్దేశంలో పాపం చేసినోడే పెళ్లి చేసుకొని ఇబ్బందులు పడుతూ ఉంటాడని చక్రవర్తి ఫన్నీగా స్పందించారు.

Latest Videos

click me!