ఒక్క వేషం ఇవ్వమని ఎన్టీఆర్ ని బతిమాలిన కుర్రాడు, కట్‌ చేస్తే ఆయనకే పోటీగా సినిమాలు చేసి స్టార్‌ హీరోగా సంచలనం

First Published | Dec 3, 2024, 2:07 PM IST

ఎన్టీఆర్‌పై అభిమానంతో మద్రాస్‌ వెళ్లి అభిమాని కట్‌ చేస్తే మూడేళ్లలో హీరో, ఆ తర్వాత ఆయనతోనే కలిసి నటించారు. ఆయనకు వ్యతిరేకంగా సినిమాలు చేసి సంచలనం సృష్టించారు.

తెలుగు సినిమాకి ఎన్టీఆర్‌ తొలితరం హీరోలుగా చెలామణి అయ్యారు. ఏఎన్నార్ తర్వాతనే ఆయన సినిమాల్లోకి వచ్చినా ఆయన్ని మించి నటనతో, సంచలనాత్మక సినిమాలతో మెప్పించారు. ఏఎన్నార్‌కే జెలసీ కలిగేలా చేశారు. తెలుగు సినిమాకి ఓ దిక్సూచిగా మారారు ఎన్టీఆర్‌. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఆయనంటే ఎంతో మంది అభిమానించే వారు. ఆ తర్వాత వచ్చిన చాలా మంది నటులు, సూపర్ స్టార్స్ కూడా ఎన్టీఆర్‌కి అభిమానులే కావడం విశేషం. అలా ఓ స్టార్‌ హీరో కూడా ఎన్టీఆర్‌ అభిమానే. ఆయనపై ఇష్టంతో ఏకంగా చెన్నైకి వెళ్లాడు.

ఆయన్ని కలిశాడు. నాక్కూడా నటించాలని ఉందని, ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడిగాడు. బతిమాలుకున్నారు. కట్‌ చేస్తే మూడేళ్లకి హీరో అయిపోయాడు, నాలుగో ఏడాది ఆయన పక్కనే సినిమాలో నటించాడు. కొన్నేళ్లకే ఏకంగా ఆయనకు వ్యతిరేకంగానే సినిమాలు చేశాడు. 


ఆయన ఎవరో కాదు సూపర్‌ స్టార్‌ కృష్ణ. నాటకాల నుంచి సినిమాల్లోకి వచ్చిన కృష్ణ.. హీరో కాకముందు ఎన్టీఆర్‌ని ఎంతగానో అభిమానించేవారు. తన అభిమాన హీరో ఎన్టీఆర్‌ అని బహిరంగంగానే ప్రకటించారు కూడా. ఆ అభిమానంతోనే డిగ్రీ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్‌ ని చూడ్డానికి మద్రాస్‌కి వెళ్లాడు కృష్ణ.

అక్కడ అనేక ఇబ్బందులు పడి ఎట్టకేలకు ఎన్టీఆర్‌ని కలిశాడు. తన మనసులో మాట చెప్పాడు. తాను సినిమాల్లోకి రావాలనుకుంటున్నట్టు, మీ సినిమాల్లో వేషం ఉంటే ఇవ్వండి అని అడిగాడట. 

ఆ సమయంలో ఇప్పుడు చిన్న పిల్లాడిలా ఉన్నావ్‌ బ్రదర్‌, రెండు మూడేళ్లు ఆగి మళ్లీ రా, అప్పటికి హీరోగా పనికొస్తావని, ఛాన్స్ లు ఇస్తానని చెప్పాడట రామారావు. దీంతో వెనుతిరిగాడు కృష్ణ. మరోవైపు తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇంతలోనే ఆదూర్తి సుబ్బారావు `తేనేమనసులు` సినిమాలో హీరోగా పరిచయం చేశారు.

తన ఐదో సినిమా `శ్రీ జన్మ`లో తన అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. ఇందులో ఎన్టీఆర్‌కి తమ్ముడిగా చేశారు కృష్ణ. అంతేకాదు ఆయనతో `నిలువు దోపిడి`, `విచిత్ర కుటుంబం` చిత్రాల్లో నటించారు. ఈ మూడూ పెద్ద హిట్‌ అయ్యాయి. 
 

`పండంటి కాపురం` సినిమా వంద రోజుల వేడుకకి ఎన్టీఆర్‌ గెస్ట్ గా వచ్చారు. ఆ రోజు ఈవెంట్‌లోనే మీతో సినిమా చేయాలని ఉందని కృష్ణ ప్రకటించగా, వెంటనే కచ్చితంగా చేస్తాను కథ రెడీ చేసుకోండి బ్రదర్‌ అన్నాడట ఎన్టీఆర్.

అలా `దేవుడు చేసిన మనుషులు` సినిమా చేశామని తెలిపారు. ఎన్టీఆర్‌తో చేసిన ప్రతి సినిమాలోనూ తాను ఆయనకు తమ్ముడిగానే నటించానని, అది తనకు దక్కిన అదృష్టం అని చెప్పారు కృష్ణ. బాలయ్య చేసిన `ఎన్టీఆర్‌ః కథానాయకుడు` ఈవెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు సూపర్‌ స్టార్‌. 
 

ఎన్టీఆర్‌ తర్వాత తరంగా కృష్ణ కూడా స్టార్‌ హీరోగా ఎదిగారు. సూపర్‌ స్టార్‌ అయ్యారు. ఎన్టీఆర్‌ సీఎం అయ్యాక ఆయనకు వ్యతిరేకంగానూ పలు సినిమాలు చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకంతో సినిమాలు చేసి సంచలనాలు సృష్టించారు. ఆ మూవీస్‌ ఎంతో పెద్ద హిట్ అయ్యాయి. కొన్నాళ్లు ఇద్దరి మధ్య బేధాభిప్రాయలు వచ్చాయి.

ఆ తర్వాత మళ్లీ కలుసుకున్నారు. తాను ఆయనకు వ్యతిరేకంగా సినిమాలు చేసినా తను మాత్రం మనసులో పెట్టుకోకుండా ఎప్పుడు కలిసినా `నమస్తే బ్రదర్ ఎలా ఉన్నారు` అంటూ పలకరించేవారని, తన ఇంటికి భోజనానికి కూడా వచ్చారని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు కృష్ణ. 

read more:పేద, మధ్యతరగతి ఆడియెన్‌కి `పుష్ప 2` ని దూరం చేస్తున్న ప్రభుత్వాలు.. టికెట్‌ రేట్లు చూస్తే పట్టపగలే చుక్కలు

also read: మహేష్‌ బాబు సినిమా వెయ్యి కోట్లు కాదు, అసలు బడ్టెట్‌ తెలిస్తే మైండ్‌ బ్లాకే.. రాజమౌళి ధైర్యం ఇదే?

Latest Videos

click me!