సెన్సషనల్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్… ఇటీవల విడుదల చేసిన ‘దేవర’ చిత్రానికి సంబంధించిన రెండో సింగిల్ ‘చుట్టమల్లె’ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు లిరికల్ వీడియోకు యూట్యూబ్ లో దాదాపు 20 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే, ఈ పాట విడుదలైన వెంటనే అనిరుధ్‌కు సంబంధించిన కొన్ని ట్రోల్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ పాట కాపీ పాట అని జనం ట్రోల్ చేయటం మొదలెట్టారు.