సిద్ధూ జొన్నలగడ్డ ఫ్లాప్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. ఈ నలుగురి కోసం చూడాల్సిందే

Published : Nov 14, 2025, 12:12 PM IST

సిద్ధూ జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించిన తెలుసు కదా చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో నిరాశపరిచిన ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. 

PREV
15
సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ

యువతలో క్రేజ్ సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డకి టిల్లు సిరీస్ తప్ప ఇతర చిత్రాలు కలిసి రావడం లేదు. ఆ మధ్యన జాక్ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఇటీవల విడుదలైన తెలుసు కదా మూవీ మంచి అంచనాలని క్రియేట్ చేసి థియేటర్స్ లోకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కూడా నిరాశపరిచింది. కానీ జాక్ తో పోల్చితే ఇది మంచి ప్రయత్నమే. అయితే హిట్ కావడానికి ఈ ప్రయత్నం సరిపోలేదు.

25
ఓటీటీలోకి వచ్చేసింది

నీరజ కోనా దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం ఇది. మోడ్రన్ యూత్ కి కనెక్ట్ అయ్యే కథాంశాన్ని ఆమె ఎంచుకున్నారు. ఇంకాస్త బాగా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే మంచి రిజల్ట్ వచ్చి ఉండేది. థియేటర్లలో నిరాశపరిచిన 'తెలుసు కదా' చిత్రానికి ప్రేక్షకులని ఆకట్టుకునే అవకాశం మరోసారి దక్కింది. నవంబర్ 14 శుక్రవారం నుంచి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైంది.

35
ఓటీటీలో ఆకట్టుకుంటుందా ?

థియేటర్లలో నిరాశ పరిచిన కొన్ని చిత్రాలకు ఓటీటీలో విశేష ఆదరణ దక్కడం చూస్తూనే ఉన్నాం. తెలుసు కదా చిత్రానికి కూడా ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కుతుందని ఆశిస్తున్నారు. మహిళా దర్శకురాలు నీరజా కోన ఈ చిత్రాన్ని యూత్ ఫుల్ కథాంశంతో తెరకెక్కించారు. వరుణ్( సిద్దు జొన్నలగడ్డ) అనే యువకుడు మాట్రిమోనీ సైట్ ద్వారా అంజలి(రాశి ఖన్నా) అనే అమ్మాయితో పరిచయం పెంచుకుంటాడు. ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకుంటారు.

45
కథాంశం ఇదే

వరుణ్ కి పిల్లలంటే బాగా ఇష్టం. కానీ అంజలికి పిల్లలు పుట్టరని తెలుస్తుంది. దీనితో అంజలి డాక్టర్ రాగా కుమార్( శ్రీనిధి శెట్టి) ని కలిసి సరోగసి గురించి తెలుసుకుంటుంది. సరోగసికి వరుణ్ కూడా ఒకే చెబుతాడు. సరోగసి మదర్ గా రాగా కుమారే సిద్దమవుతుంది. ఆమె మరెవరో కాదు వరుణ్ కి మాజీ గర్ల్ ఫ్రెండ్. ఈ విషయం వరుణ్ కి తెలిసిన తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది ఆసక్తికరం.

55
ఈ నలుగురి కోసం చూడొచ్చు

ఓటీటీలో రిలీజ్ అయిన ఈ చిత్రం కోసం యువత ఆసక్తి చూపుతున్నారు. తొలిసారి దర్శకురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ మంచి అటెంప్ట్ చేశారు. సిద్దు జొన్నలగడ్డ మోడ్రన్ లవ్ స్టోరీ, న్యూ ఏజ్ కథలకు బ్రాండ్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా గ్లామరస్ గా బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించారు. ఈ నలుగురి కోసం తెలుసు కదా మూవీ ఓటీటీలో చూడవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories