Thalapathy Vijay: వెనకే ఉన్న కుర్రాడు ఇంత పని చేస్తాడని కరుణానిధి ఊహించి ఉండ‌రు.. విజయ్ సక్సెస్ పై ఆర్జీవీ పోస్ట్ వైరల్

Published : May 06, 2026, 11:19 AM IST

తమిళనాట విజయ్ దళపతి విజయంపై దేశ వ్యాప్తంగా ప్రముఖులు స్పందిస్తున్నారు. విజయ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఎప్పటిలాగానే తన మార్క్ కామెంట్స్ తో రామ్ గోపాల్ వర్మ దళపతిని విష్ చేశాడు. ఆయన సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ అందరిని ఆకర్శిస్తోంది. 

PREV
14
తమిళ రాజకీయాల్లో సంచలనంగా విజయ్..

తమిళనాడు రాజకీయాల్లో విజయ్ దళపతి సంచలనంగా మారాడు. ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీతో అద్భుతమైన ప్రభంజనాన్ని సృష్టించాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ పార్టీ సాధించిన ఘన విజయం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గట్టి సవాల్ విసురుతూ, విజయ్ యువతను, సామాన్య ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యాడు. దాంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.

24
విజయ్ విజయంపై దేశ వ్యాప్తంగా చర్చ..

విజయ్ ఎన్నికల టైమ్ లో నిర్వహించిన సభలకు భారీగా జనం తరలివచ్చారు. ఆ జనసందోహం ఓట్లుగా మారి, అసెంబ్లీలో ఆయన పార్టీ బలమైన శక్తిగా అవతరించింది. ఈ పరిణామం తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ అనూహ్య విజయంపై ఎంతో మంది సినీ, రాజకీయ సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ.. విజయ్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈక్రమంలో అందరి చూపు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వైపు వెళ్లింది. ఆయన ఎలా స్పందిస్తాడా అని అంతా వెయిట్ చేశారు. అనుకున్నట్టుగానే తన మార్క్ కామెంట్స్ తో వర్మ అదరగొట్టాడు.

34
రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా పోస్ట్..

విజయ్ విజయంపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు వర్మ. దివంగత తమిళ నేత కరుణానిధి (కలైంజర్) వెనుక విజయ్ చిన్నపిల్లాడిగా నిలబడి ఉన్న పాత ఫోటోను ఆయన షేర్ చేశారు. ఆ ఫోటోకు స్పందిస్తూ వర్మ తనదైన శైలిలో సెటైరికల్ కామెంట్స్ చేశారు. “తన వెనుక ఉన్న ఈ పిల్లాడు ఒకరోజు తన పార్టీనే తుడిచిపెట్టే స్థాయికి ఎదుగుతాడని కలైంజర్ కలలో కూడా ఊహించి ఉండరు” అని ఆర్జీవి రాసుకొచ్చాడు. ఈ వ్యాఖ్యల ద్వారా డీఎంకే వంటి బలమైన పునాదులు కలిగిన పార్టీకి విజయ్ రూపంలో వచ్చిన పెద్ద సవాల్ ఊహించలేనిదని వర్మ అన్నారు.

44
ముఖ్యమంత్రిగా విజయ్ మార్క్ ఎలా ఉంటుంది?

రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకప్పుడు డీఎంకే అగ్రనేతల నీడలో పెరిగిన ఒక కుర్రాడు, నేడు అదే పార్టీ ఉనికిని ప్రశ్నించే స్థాయికి చేరడం రాజకీయాల్లో అరుదైన పరిణామం అని చర్చించుకుంటున్నారు జనాలు. విజయ్ కేవలం సినిమా స్టార్‌గా మాత్రమే కాకుండా, రాజకీయ వ్యూహకర్తగా కూడా తన సత్తాని చాటుకుంటున్నారు. 

డీఎంకే లాంటి బలమైన పార్టీని మూడో స్థానానికి పరిమితం అయ్యేలా చేశాడు దళపతి. ఇక సీఎంగా ఆయన ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. కొత్త పథకాలతో పాటు తమిళనాడుతో తన మార్క్ కనిపించేలా పాలన చేయబోతున్నట్టు సమాచారం. మరి ముఖ్యమంత్రిగా విజయ్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories