Jayalalitha-Trisha: జయలలితకి, త్రిషకి మధ్య ఉన్న పోలికలివే, వామ్మో అన్నీ సేమ్‌.. సీఎం అవ్వడం పక్కా?

Published : May 06, 2026, 11:14 AM IST

Jayalalitha-Trisha: ఒకప్పుడు ఎంజీఆర్‌, జయలలిత రిలేషన్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీరి రిలేషన్‌ విజయ్‌, త్రిష రిలేషన్‌కి దగ్గరగా ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. దీంతో  త్రిష సీఎం అవడం పక్కా అంటున్నారు. 

PREV
16
జయలలిత మాదిరిగానే త్రిష

తమిళరాజకీయాలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యాయి. ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయ్‌ కి చెందిన టీవీకే పార్టీ భారీ స్థాయిలో సీట్లని గెలుచుకుంది. 108సీట్లు గెలుచుకొని లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అంతేకాదు ఇతరుల మద్ధతుతో ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు విజయ్‌. ఈ క్రమంలో ఇప్పుడు త్రిష పేరు బాగా వినిపిస్తోంది. ఆమె కూడా రాజకీయాల్లోకి రాబోతుందని, విజయ్‌తో ఉండబోతుందనే ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఒకప్పుడు ఎంజీఆర్‌-జయలలిత మాదిరిగానే, ఇప్పుడు విజయ్‌, త్రిష కూడా తమిళ రాజకీయాలను శాసిస్తారని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు సాధ్యం. వారి మధ్య ఉన్న పోలికలు ఏంటనేది చూస్తే.

26
ఎంజీఆర్‌తో రిలేషన్‌ ఆ తర్వాత సీఎం అయిన జయలలిత

యాభై ఏళ్ల క్రితం ఎంజీఆర్‌ తమిళ రాజకీయాల్లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచారు. ఆయన సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి సొంతంగా పార్టీ పెట్టి(ఏఐఏడీఎంకే) సీఎం అయ్యారు. ఆ సమయంలో జయలలిత ఆయనతో రిలేషన్‌లో ఉంది. ఓరకంగా సాహజీవనం చేస్తుందని చెప్పొచ్చు. పెళ్లి చేసుకోకుండా ఆయనతోనే ఉండిపోయింది. రాజకీయాల్లో ఇన్‌వాల్వ్ అయ్యింది. సీఎం తర్వాత సీఎం అనే రేంజ్‌కి ఎదిగింది. ఎంజీఆర్‌ మరణం తర్వాత ఆయన స్థానాన్ని తాను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో అనేక అవమానాలు ఫేస్‌ చేసింది. కానీ వాటిని తట్టుకొని నిలబడింది. సీఎం అయ్యింది. తమిళనాడు రాజకీయాలను శాసించింది.

36
త్రిష, జయలలితకి ఉన్న పోలికలు

ఇదిలా ఉంటే ఇప్పుడు త్రిష విషయంలో అదే జరగబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. విశ్లేషకులు సైతం ఇదే భావిస్తున్నారు. మరో ఎంజీఆర్‌-జయలలిత లా.. విజయ్‌-త్రిష బాండింగ్‌ ఉండబోతుందని, భవిష్యత్‌లో త్రిష సీఎం అయినా ఆశ్చర్యం లేదంటున్నారు. అయితే వాటికి కొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్నారు. జయలలితకి, త్రిషకి ఉన్న సిమిలారిటీస్‌(పోలికలు)ని చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మరి జయలలితకి, త్రిషకి ఉన్న పోలికలు ఏంటి? సీఎం అవడం ఎలా సాధ్యమనేది చూస్తే.

46
సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన జయలలిత

సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన జయలలిత.. నాటకాలు వేశారు. బాలనటిగానూ నటించారు. 1965లో ఆమె `వెన్నిరా ఆడై` అనే చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యారు. అంతకు ముందు చిన్న పాత్రల్లో కూడా మెరిశారు. కానీ ఈ సినిమా ఆమెకి మంచి బ్రేక్‌ ఇచ్చింది. సూపర్‌ హిట్‌ అయ్యింది. ఆ తర్వాత అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ సినిమాలు చేసి మెప్పించింది. తిరుగులేని లేడీ సూపర్‌ స్టార్‌గా ఎదిగింది జయలలిత. అయితే జయలలిత బ్రాహ్మణ ఫ్యామిలీ నుంచి వచ్చింది. చర్చి పార్క్ స్కూల్‌లో చదువుకుంది. ఆ తర్వాత హీరోయిన్‌ అయ్యింది. పెళ్లికి దూరంగా ఉంది. ఎంజీఆర్‌తో సాన్నిహిత్యంగా ఉంది. ఆయనకు సహాయకురాలిగా ఉండి, ఆయన చనిపోయాక సీఎం అయ్యింది.

56
విజయ్‌ తో రిలేషన్‌లో ఉన్న త్రిష

ఇవే లక్షణాలు ఇప్పుడు త్రిషలోనూ కనిపిస్తున్నాయి. త్రిష 1999లో `జోడి` చిత్రంతో చిన్న పాత్రలో మెరిసింది. కానీ ప్రియదర్శన్‌ రూపొందించిన `లీసా లీసా` అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇది తమిళ మూవీ. ఇందులో శ్యామ్‌ హీరో. కానీ ఈ మూవీ విడుదల డిలే అయ్యింది. దీంతో ఆమె సూర్యతో నటించిన `మౌనం పెసియాదే` అనే చిత్రంతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. విక్రమ్‌ నటించిన `సామీ`తో పెద్ద బ్రేక్‌ అందుకుంది. తెలుగు, తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. అయితే త్రిష కూడా బ్రహ్మాణ ఫ్యామిలీ నుంచే వచ్చింది. చర్చి పార్క్ స్కూల్‌లో చదువుకుంది. పెళ్లికి దూరంగా ఉంది. 43ఏళ్లు దాటినా ఒంటరిగానే ఉంది. అయితే విజయ్‌తో రిలేషన్‌లో ఉందని టాక్‌. విజయ్‌ భార్య సంగీత కూడా ఇదే ఆరోపిస్తుంది. త్రిష కారణంగానే ఆమె విజయ్‌తో విడాకులకు సిద్ధమయ్యిందని సమాచారం.

66
జయలలిత మాదిరిగానే త్రిష సీఎం అవుతుందా?

ఈ పోలికల కారణంగా జయలలిత మాదిరిగానే భవిష్యత్‌లో త్రిష కూడా సీఎం అవుతుందని అంటున్నారు. సోషల్‌ మీడియాలో ఇది పెద్ద వైరల్‌గా మారింది. మరి జయలలిత మాదిరిగానే త్రిష రాజకీయాలపై ఆసక్తి చూపిస్తుందా? అనేది చూడాలి. మొన్న తన పుట్టిన రోజున ఆమె తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని నేరుగా విజయ్‌ వద్దకు వెళ్లి ఆయన్ని అభినందించింది. అదే సమయంలో బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఇదే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది. ఎంజీఆర్‌ కోసం జయలలిత పెళ్ళి చేసుకుండానే ఉండిపోయింది. ఇప్పుడు త్రిష కూడా విజయ్‌ కోసం పెళ్లికి దూరంగా ఉందని టాక్‌. ఇవన్నీ ఇద్దరికి కలుస్తున్నాయి. మరి రాజకీయ జీవితం కూడా కలుస్తుందా? అనేది కాలమే సమాధానం చెబుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories