Vijay: నటుడు విజయ్ గత సంవత్సరం `తమిళనాడు వెట్రి కజగం` అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. పార్టీ ప్రారంభించి ఒక సంవత్సరం అవుతున్న తరుణంలో, ఇటీవల రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది విజయ్ పార్టీ. దానిని తమిళనాడు వెట్రి కజగం ఘనంగా జరుపుకుంది.
పార్టీ ప్రారంభించిన వెంటనే దాని తొలి రాష్ట్ర సమావేశాన్ని గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఘనంగా నిర్వహించిన విజయ్, ఆ తర్వాత కనిపించలేదు. ఆయన క్షేత్రస్థాయి రాజకీయాలకు రాకుండా ఇంటి నుండే పనిచేస్తున్నారని విమర్శలు వచ్చాయి.