Thandel: ‘తండేల్’ సోమవారం పరీక్ష పాసైందా? , కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?

Published : Feb 11, 2025, 08:50 AM IST

  Thandel:  నాగ చైత‌న్య న‌టించిన చిత్రం తండేల్‌. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కింది. సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక న‌టించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 7న‌ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. 

PREV
14
  Thandel: ‘తండేల్’ సోమవారం పరీక్ష పాసైందా? , కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?
Is Naga Chaitanya Thandel Passes Monday Test? in telugu


ఏ సినిమాకైనా కలెక్షన్స్ పరంగా వీకెండ్ కీలకంగా మారింది. వీకెండ్ తర్వాత వచ్చే సోమవారం కలెక్షన్స్ డ్రాప్ ఉంటుంది. దాంతో ఏ సినిమానైనా సోమవారం వర్కవుట్ అయితే సినిమా నిలబడిపోయినట్లే అని ట్రేడ్ అంచనా  వేస్తుంది. ఇక నాగ చైతన్య మరియు సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  

చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, విడుదలైన తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 62.37 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని టీమ్ అఫీషియల్ గా ప్రకటించింది.ల‌వ్‌, యాక్ష‌న్‌, దేశ‌భ‌క్తి బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్నింగ్ షో నుంచే పాటిజివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే వీకెండ్ దుమ్ము దులిపిన ఈ చిత్రం సోమవారం పరీక్ష పాసైందా, కలెక్షన్స్ పరిస్దితి ఏమిటో చూద్దాం.

24
Is Naga Chaitanya Thandel Passes Monday Test? in telugu


ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తండేల్ చిత్రం మొదటి సోమవారం టెస్ట్ ని డీసెంట్ గా పాసైంది. మార్నింగ్ షోలు డల్ గా ఉన్నా మాట్నీ నుంచి నుంచి ఊపందుకుంది. చాలా చోట్ల ఈవినింగ్, నైట్ షోలు బాగానే ఫిల్ అయ్యాయి.  అయితే మాట్నీకు వచ్చినట్లుగా ఈవినింగ్, నైట్ షోలకు జనం రాలేదు.

మాట్నీ షోలు చూసి 8 కోట్లు దాకా కలెక్ట్ చేస్తుందని అంచనా వేసారు. కానీ మిగతా కలెక్షన్స్ లో ఊపు లేకపోవటంతో ఆరుకోట్లు గ్రాస్ వచ్చినట్లు సమాచారం. అయితే ఇది నాగచైతన్య వంటి హీరోకు  డీసెంట్ హోల్డ్ అనే చెప్పాలి. వచ్చే వీకెండ్ కు పెద్ద జంప్ ఉంటుందని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. అదే జరిగితే  సినిమా మంచి హిట్ క్రింద లెక్క. 
 

34
Is Naga Chaitanya Thandel Passes Monday Test? in telugu


 సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ పరంగా, తెలుగు వెర్షన్ కోసం రూ. 30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ సాధించడానికి, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 70 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి.  మరో ప్రక్క అమెరికాలో కూడా ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ప్రేక్షకుల నుండి వచ్చిన సానుకూల స్పందనతో, ‘తండేల్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.  
 

44
Is Naga Chaitanya Thandel Passes Monday Test? in telugu

సాయి పల్లవి నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, శాండాట్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీవాసు ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. శ్రీకాకుళం జిల్లాలోని జాల‌ర్ల‌ జీవితంలో జ‌రిగిన యదార్థ గాధ ఆధారంగా తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో నాగ చైతన్య నటనకు ఆడియెన్స్‌ ఫిదా అయ్యారు. రాజు, సత్య పాత్రలో నాగచైతన్య, సాయి పల్లవి జీవించేశారనే అంటున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories