జేసన్ సంజయ్‌కు సినిమా ఇండస్ట్రీ కొత్తేమీ కాదు. ఎందుకంటే, అతని తండ్రి దళపతి విజయ్ సౌత్ ఇండియాలోనే టాప్ స్టార్. విజయ్ సినిమాలకు తమిళనాడులోనే కాదు, ఇండియా వైడ్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తున్న జేసన్‌పై సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి.
కానీ, జేసన్ కేవలం తన తండ్రి ఇమేజ్‌పైనే ఆధారపడకుండా, సొంత టాలెంట్‌తో పైకి రావాలని అనుకుంటున్నాడట. డైరెక్టర్‌గా మొదటి ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోయినా, నటుడిగా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇప్పుడు అతని ముందుంది.
అయితే, హీరోగా మొదటి సినిమా రిలీజ్ అయినప్పుడు, అభిమానులు కచ్చితంగా విజయ్ యాక్టింగ్‌తో జేసన్‌ను పోల్చి చూస్తారు. నాన్నకున్న క్రేజ్ మధ్యలో, తనకంటూ ఒక సెపరేట్ యాక్టింగ్ స్టైల్ క్రియేట్ చేసుకోవడం అతనికి నిజంగా పెద్ద సవాలే.